Sankranthi Movies Ticket Prices : చరణ్ సినిమాతో పాటు బాలయ్య, వెంకటేష్ సినిమాలకు కూడా టికెట్ రేట్ల పెంపు.. ఏ సినిమాకు ఎంత పెంచారంటే..

సంక్రాంతి సినిమాలన్నిటికీ టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

Sankranthi Movies Ticket Prices : చరణ్ సినిమాతో పాటు బాలయ్య, వెంకటేష్ సినిమాలకు కూడా టికెట్ రేట్ల పెంపు.. ఏ సినిమాకు ఎంత పెంచారంటే..

AP Government gives Ticket Prices hikes and Extra Shows for all Sankranthi Movies Game Changer Daaku Maharaaj Sankranthiki Vasthunnam Details Here

Updated On : January 5, 2025 / 12:37 PM IST

Sankranthi Movies Ticket Prices : ఏపీలో NDA ప్రభుత్వం వచ్చినప్పటినుంచి సినిమా వాళ్లకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలన్నిటికీ టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

Also Read : Ram Charan – Aravind : నాన్న, బాబాయ్ లతో వెళ్ళను.. ఆ విషయంలో అరవింద్ మామ బెస్ట్.. చరణ్ ఆసక్తికర కామెంట్స్..

ఏపీ ప్రభుత్వ అనుమతుల ప్రకారం.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు జనవరి 10వ తేదీన ఉదయం 1 గంటకు బెనిఫిట్ షో, ఆ రోజు ఆరు షోలకు, ఆ తర్వాత నుంచి రెండు వారాల వరకు రోజుకు అయిదు షోలకు అనుమతులిచ్చారు. ఇక బెనిఫిట్ షో టికెట్ ధర గేమ్ ఛేంజర్ కు 600 రూపాయలుగా విక్రయించుకునేందుకు, జనవరి 10వ తేదీ నుంచి 23 తేదీ వరకు మల్టిప్లెక్స్ లలో 175 రూపాయలు, సింగిల్ థియేటర్లలో 135 రూపాయలు టికెట్ రేటు పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు.

బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకు ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోకు, మొదటి రోజు నుంచి రెండు వారాల వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షోకు టికెట్ ధర 500 రూపాయలు పెట్టుకునేలా, రెండు వారాల పాటు మల్టీప్లెక్సుల్లో 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

Also Read : Ram Charan : కూతురు గురించి మాట్లాడుతూ బాలయ్య షోలో ఏడ్చేసిన రామ్ చరణ్.. క్లిన్ కారా ఫేస్ ఎప్పుడు చూపిస్తారంటే..

ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రిలీజ్ రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు అయిదు షోలకు అనుమతులు ఇచ్చారు. అలాగే మల్టీప్లెక్సుల్లో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు టికెట్ రేటు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

తెలంగాణలో ఇటీవల జరిగిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనతో సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇకపై ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతలు నిరాశ చెందగా ఏపీలో మాత్రం అడిగిన అన్ని అనుమతులు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.