Game Changer : తెలంగాణలో కూడా గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు.. ఎన్ని రోజులు? ఎంత పెంచారంటే?

నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు కోసం సీఎంని కలిశారు.

Game Changer Ticket Rates Hike gives in Telangana Here Details

Game Changer : సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచి, ఎక్స్ ట్రా షోలకు అనుమతులు ఇచ్చారు. తెలంగాణలో ఇటీవల సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని అన్నారు.

Also Read : Ram Charan : నాగబాబు బాబాయ్ వల్ల డాడీ బెల్ట్ తీసి మరీ కొట్టారు.. చిరంజీవి చరణ్ ని ఏ విషయంలో కొట్టారో తెలుసా?

అయితే నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల కోసం సీఎంని కలిశారు. దీంతో టికెట్ రేట్లు పెంచుతూ పర్మిషన్ ఇచ్చారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో అడగ్గా దాన్ని మాత్రం రిజెక్ట్ చేసారు. జనవరి 10న మొదటి రోజు ఉదయం 4 నుంచి ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చారు. మొదటి రోజు మల్టీప్లెక్స్ లలో 150, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు అనుమతి ఇస్తూ మల్టీప్లెక్స్ లలో 100, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

దీంతో గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణలో కూడా పది రోజుల పాటు టికెట్ రేట్లు పెరిగాయి. ఈ ఎఫెక్ట్ తో కలెక్షన్స్ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది. డాకు మహారాజ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అవసర్లేదని నిర్మాత నాగవంశీ అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు టికెట్ రేట్ల పెంపు అడగలేదు.

 

Also See : అల్లు అర్జున్ పుష్ప 2 మేకింగ్ వీడియో రిలీజ్.. బన్నీ, సుకుమార్ ఎంత కష్టపడ్డారో చూశారా?