తాప్సీ ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో, వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై, ఎస్.శక్తికాంత్ నిర్మించిన ‘గేమ్ ఓవర్’ టీజర్ రిలీజ్..
గతకొంత కాలంగా బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తుంది తాప్సీ.. పింక్, మన్మర్జియాన్, బద్లా వంటి నటనకు ఆస్కారమున్న సినిమాలతో, విభిన్న పాత్రలు చేస్తూ విజయ వంతంగా కెరీర్ కొనసాగిస్తుంది తాప్సీ పన్ను. . ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గేమ్ ఓవర్’. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో, వై నాట్ స్టూడియోస్ బ్యానర్‌పై, ఎస్.శక్తికాంత్ నిర్మించిన ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా విడుదల చేసారు.
టీజర్‌ని బట్టి తాప్సీ గేమ్ డిజైనర్ క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తుంది. తాప్సీ గేమ్ డిజైన్ చెయ్యడం, ఆమెని ఎవరో తరుముతుండడం, ఆమె భయపడుతుండం.. ఇలా ఉత్కంఠ భరితంగా సాగింది గేమ్ ఓవర్ టీజర్. ‘మనకి రెండు జీవితాలుంటాయి.. రెండోది మొదలయ్యే సరికి, ఒక జీవితమే ఉందని అర్థమవుతుంది’.. అని చెప్పారు టీజర్‌లో.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో జూన్ 14న విడుదల చెయ్యనున్నారు.
కెమెరా : ఎ.వసంత్, ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, మ్యూజిక్ : రోన్ ఎథాయ్ యోహన్, డైలాగ్స్ : వెంకట్ కాచర్ల (తెలుగు), శృతి మదన్ (హిందీ), రచన : అశ్విన్ శరవణన్, కావ్యా రామ్‌కుమార్, సహ నిర్మాత : చక్రవర్తి రామచంద్ర.
వాచ్ టీజర్..