Garbha : కులాల నేపథ్యంలో రా అండ్ రస్టిక్ సినిమా ‘గర్భ’..

ఇటీవల సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కూడా హిట్ చేస్తున్నారు. అలాగే థియేటర్స్ లో రిలీజ్.........

Garbha movie released in MX Player

Garbha :  ఇటీవల సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కూడా హిట్ చేస్తున్నారు. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అవ్వకపోయినా ఓటీటీలోనే వచ్చి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. తాజాగా కులాలు, కులాంతరాల మీద ‘గర్భ’ అనే రా అండ్ రస్టిక్ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

ఒక గ్రామంలో ఉండే కులాంతరాల మీద ఈ కథని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. కొత్త దర్శకుడు సంజీవ్ చిన్నకోట్ల ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాని మొత్తం కొత్త నటులతో, టెక్నీషియన్స్‌తోనే తీశారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కులాల సమస్యతో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

Harish Shankar : అలాంటి వాళ్లందరికీ చెప్పుదెబ్బ ధమాకా సినిమా.. హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఆడతాయి..

ఇక ఈ గర్భ సినిమాని ఇటీవలే MX ప్లేయర్ ఓటీటీలో రిలీజ్ చేశారు. దీంట్లోనే కాక హంగామా ప్లే, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్.. లాంటి మరిన్ని ఓటీటీలో కూడా ఈ సినిమాని విడుదల చేశారు. పలువురు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియచేస్తున్నారు.