Harish Shankar : అలాంటి వాళ్లందరికీ చెప్పుదెబ్బ ధమాకా సినిమా.. హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఆడతాయి..

డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ధమాకా సినిమా సక్సెస్ మీట్ కి వచ్చాడు. స్టేజిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ రవితేజ తనకి ఛాన్స్ ఇచ్చాడని, ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఇచ్చి హిట్ సినిమా ఇచ్చాడని ఎమోషనల్ అవుతూ రవితేజ కాళ్ళకి దండం పెట్టాడు. అలాగే ఇటీవల కొంతమంది చేసిన కామెంట్స్ పై హరీష్ శంకర్...........

Harish Shankar : అలాంటి వాళ్లందరికీ చెప్పుదెబ్బ ధమాకా సినిమా.. హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఆడతాయి..

Harish Shankar serious comments on who oppose entertainment movies

Harish Shankar :  రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఫుల్ గా కామెడీ, ఎంటర్టైన్మెంట్, అదిరిపోయే సాంగ్స్ ఉండటంతో జనాలు సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. మళ్ళీ మాస్ మహారాజ కంబ్యాక్ గట్టిగా ఇచ్చాడు. రవితేజ ఫ్యాన్స్ అయితే పండగా చేసుకుంటున్నారు ఈ సినిమాతో. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో సినిమా బాగా ప్రమోట్ అయింది.

ధమాకా సినిమా ఇప్పటికే మొదటి వారంలోనే 62 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుత షేర్ 30 కోట్లకు పైగా రాగా దాదాపు 15 కోట్ల ప్రాఫిట్స్ లో నడుస్తుంది ఈ సినిమా. 100 కోట్ల టార్గెట్ వైపు ధమాకా అడుగులేస్తోంది. ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో ధమాకాకి ఇంకా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ధమాకా ఈ రేంజ్ లో విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.

Prabhas Shoe Size : ప్రభాస్ సైజ్ బట్టలు, షూస్ బయట దొరకవంట.. ప్రభాస్ షూ సైజ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ధమాకా సినిమా సక్సెస్ మీట్ కి వచ్చాడు. స్టేజిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ రవితేజ తనకి ఛాన్స్ ఇచ్చాడని, ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఇచ్చి హిట్ సినిమా ఇచ్చాడని ఎమోషనల్ అవుతూ రవితేజ కాళ్ళకి దండం పెట్టాడు. అలాగే ఇటీవల కొంతమంది చేసిన కామెంట్స్ పై హరీష్ శంకర్ గట్టిగా స్పందించాడు. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది మేధావులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడతాయి. హీరోయిజం, ఎలివేషన్స్, ఎంటర్టైన్మెంట్ సినిమాలకి కాలం చెల్లింది, అలాంటి సినిమాలు ఆపేయాలని అంటున్నారు. ఓటీటీ వచ్చింది, సినిమా టేస్ట్ మారింది అని అంటున్నారు. అలాంటి వాళ్లందరికీ ఈ ధమాకా సినిమా చెప్పుదెబ్బ లాంటింది. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళకి. ఎప్పటికైనా హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఆడతాయి అని సీరియస్ గా మాట్లాడాడు.