Garikipati Fires on Chiranjeevi
Chiranjeevi: ఈ విజయదశమికి “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి అఖండమైన విజయాన్నే అందుకున్నాడు. మొదటి షో నుంచి ఫుల్ పోస్టివ్ టాక్ సంపాదించుకోవడంతో మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ లాంటి సినిమా, మళ్ళీ మాకు బాస్ ఇచ్చాడంటూ.. బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.
GodFather Success Celebrations : చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
ఇక ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కారిక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు చిరంజీవి కూడా నేడు అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు కూడా ఈ కారిక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అయన అదే వేదికపై ఉన్న చిరంజీవిపై ఆగ్రహంతో నోరు విరిచారు.
స్టేజిపై గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి కొంతమంది యువత వేదిక మీదకు వచ్చారు. గరికపాటి ప్రసంగాన్ని వారు పట్టించుకుపోవడంతో, ఆగ్రహం చెందిన అయన మెగాస్టార్ తో.. “చిరంజీవి గారు మీరు ఫోటోలు దిగడం ఆపితే నేను మాట్లాడతాను, లేదంటే నేను ప్రసంగం ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.