GodFather Review : గాడ్‌ఫాదర్ రివ్యూ.. ఇది కదా బాస్ సినిమా అంటే.. బాస్ ఈజ్ బ్యాక్..

సినిమా చూసిన తర్వాత ఇది కదా బాస్ సినిమా అని అంటున్నారు అభిమానులు. చిరంజీవిని కరెక్ట్ గా వాడుకుంటే ఎలివేషన్స్ ఇలానే ఉంటాయి, థియేటర్స్ దద్దరిల్లిపోతాయి అంటున్నారు...................

GodFather Review : గాడ్‌ఫాదర్ రివ్యూ.. ఇది కదా బాస్ సినిమా అంటే.. బాస్ ఈజ్ బ్యాక్..

Chiranjeevi GodFather Movie Review

GodFather Review :  మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు చిరంజీవి. మోహన రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాధ్.. ముఖ్య పాత్రల్లో నటించారు. రీమేక్ సినిమా అయినా ముందునుంచి అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి ముందుండి ఈ సినిమా ప్రమోషన్స్ ని చేశారు. ఇక సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గాడ్ ఫాదర్ సినిమా. మొత్తానికి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని చిరంజీవి పండగపూట హిట్ కొట్టేశాడు.

కథ విషయానికొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత సీఎం అవ్వాలని ఆయన చుట్టూ పక్కన ఉన్న వాళ్లంతా కళలు కంటూ ఉంటారు. సీఎం అల్లుడిగా నటించిన సత్యదేవ్ వాళ్ళందర్నీ తన చేతిలో ఉంచుకొని తాను ముఖ్యమంత్రి అవ్వడానికి సన్నాహాలు చేస్తూ ఉంటాడు. కానీ చిరంజీవి నిజాయితీ ఉన్న వ్యక్తిగా, సీఎం పక్కనే ఉండే వ్యక్తి కావడంతో సత్యదేవ్ చేసే పనులకి అడ్డం పడుతుంటాడు. మరి ఎవరు సీఎం అయ్యారు? ఆ పార్టీని ఎవరు నడిపించారన్నదే సినిమా కథాంశం.

ఒక రీమేక్ సినిమా తీసి జనాల్ని మెప్పించడం అంత సాధ్యం కాదు. అందులోను చిరంజీవి ముందు సినిమా ఆచార్య ఫ్లాప్ అవ్వడంతో చిరంజీవికి ఒక సాలిడ్ హిట్ అవసరం. దర్శకుడు ఆ గ్రాండ్ హిట్ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత ఇది కదా బాస్ సినిమా అని అంటున్నారు అభిమానులు. చిరంజీవిని కరెక్ట్ గా వాడుకుంటే ఎలివేషన్స్ ఇలానే ఉంటాయి, థియేటర్స్ దద్దరిల్లిపోతాయి అంటున్నారు. ఒక ఇంద్ర, ఒక ఠాగూర్, ఒక స్టాలిన్ లాంటి సినిమాలకి మించి ఇందులో ఎలివేషన్స్ ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఇక ప్రేక్షకులు కూడా చిరంజీవిని ఇలా చూసి చాలా రోజులైంది. ఇలాంటి సినిమాలు రావాలి చిరంజీవి ఇమేజ్ కి తగ్గ సినిమా ఇది అని అన్నారు.

అయితే ఒరిజినల్ కథని తీసుకున్నా క్లైమాక్స్ మార్చేశారు. కథలో కూడా మరిన్ని పాత్రలు జత చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్ సినిమా కంటే ఇదే బాగుంది అని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. సినిమాకి సత్యదేవ్ చాలా ప్లస్ అయ్యాడు. హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. సత్యదేవ్ విలన్ గా, చిరంజీవితో ఫేస్ టు ఫేస్ సీన్స్ లో అదరగొట్టేశాడు. కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు చిరంజీవి చాలా సార్లు ప్రమోషన్స్ లో సత్యదేవ్ ని పొగిడాడు. సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ సత్యదేవ్ ని పొగడటంలో తప్పులేదు అనిపిస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ కూడా మెప్పించాడు. కనిపించేది పది నిమిషాలైనా ఫైట్ సీక్వెన్స్ లో అదరగొట్టేశాడు. నయనతార కూడా చాలా డీసెంట్ క్యారెక్టర్ కావడంతో సైలెంట్ గా నటించి అందర్నీ ఆకట్టుకుంది. తన కమర్షియల్ సినిమాల ఎఫెక్ట్ ఇందులో ఎక్కడా కనపడకుండా జాగ్రత్త పడింది. పూరి జగన్నాధ్ కూడా ఒరిజినల్ సినిమాలో పాత్ర కంటే కూడా బెటర్ గానే చేశాడు. మిగిలిన పాత్రలన్నీ కూడా బాగా చేశాయి.

సినిమాకి మరో ప్లస్ తమన్. సినిమాకి BGM అదరగొట్టేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఒరిజినల్ లూసిఫర్ సినిమా కంటే కూడా ఇది బాగుండటానికి కారణం తమన్ ఇచ్చిన BGM అనే చెప్పొచ్చు. తమన్ కి గుడి కట్టినా తప్పులేదు అని మెగా అభిమానులు అంటున్నారు. చిరంజీవి ఈ సినిమాలో చాలా తక్కువగా మాట్లాడతాడు. ఆ తక్కువలో విసిరినా డైలాగ్స్ కూడా తూటాల్లాగా పేలాయి. కొన్ని కొన్ని సీన్స్ లో చిరంజీవి కళ్ళతోనే అదరగొట్టేశారు. యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. వింటేజ్ చిరంజీవి వచ్చేసినట్టే. దర్శకుడిగా మోహన్ రాజా ఫుల్ సక్సెస్ అయ్యాడు.

GodFather : కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా తయారు చేసేది ఈ బ్రహ్మ.. మరో వాయిస్ ట్వీట్‌తో గాడ్‌ఫాదర్ పై అంచనాలు పెంచేసిన మెగాస్టార్

సినిమాలో మైనస్ ఏమన్నా ఉందంటే సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ లో సల్మాన్ ఖాన్ తో చిరు సాంగ్. కాకపోతే అది ప్రమోషన్ కోసం పెట్టింది అని అర్థమైపోతుంది. కొన్ని చోట్ల ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇంకొంచెం బాగా పెట్టి ఉండొచ్చు అనిపిస్తుంది. ఇక సైరాలో చిరుకి భార్యగా నటించిన నయనతార ఇందులో చెల్లిగా నటించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఆ సీన్స్ చూస్తే పర్ఫెక్ట్ గానే డిజైన్ చేశారు. మొత్తానికి ఇది కదా బాస్ సినిమా, బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. చిరు ఏజ్ కి, ఆయన స్థాయికి ఇలాంటి సినిమాలు కదా రావాల్సింది అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.