GodFather : కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా తయారు చేసేది ఈ బ్రహ్మ.. మరో వాయిస్ ట్వీట్‌తో గాడ్‌ఫాదర్ పై అంచనాలు పెంచేసిన మెగాస్టార్

కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేముందు సినిమాలోని ఓ డైలాగ్ ని ట్విట్టర్ లో వాయిస్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారుచిరంజీవి.............

GodFather : కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా తయారు చేసేది ఈ బ్రహ్మ.. మరో వాయిస్ ట్వీట్‌తో గాడ్‌ఫాదర్ పై అంచనాలు పెంచేసిన మెగాస్టార్

GodFather :  మోహన్ లాల్ మలయాళంలో నటించిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాని తెరకెక్కించారు. మోహన రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాధ్.. పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దసరాకి కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.

దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చిరంజీవి కూడా ప్రతి ప్రమోషన్ లోను పాల్గొని సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేముందు సినిమాలోని ఓ డైలాగ్ ని ట్విట్టర్ లో వాయిస్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు చిరంజీవి. రాజకీయాలకి, చిరంజీవి నిజ జీవితానికి ఈ డైలాగ్ దగ్గరగా ఉండటంతో ఈ డైలాగ్ వల్ల సినిమాపై ఒక్కసారిగా అందరికి ఆసక్తి కలిగింది. తాజాగా రేపు సినిమా రిలీజ్ ఉండటంతో మరో వాయిస్ ట్వీట్ చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు చిరంజీవి.

Prabhas : ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. ప్రభాస్ చేతుల మీదుగా.. రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి..

తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి మరో డైలాగ్.. ”కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా తయారు చేసేది ఈ బ్రహ్మ” అంటూ వాయిస్ ట్వీట్‌ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారి గాడ్‌ఫాదర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.