chiranjeevi post another dialogue from GodFather with his voice on twitter
GodFather : మోహన్ లాల్ మలయాళంలో నటించిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాని తెరకెక్కించారు. మోహన రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాధ్.. పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దసరాకి కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.
దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చిరంజీవి కూడా ప్రతి ప్రమోషన్ లోను పాల్గొని సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేముందు సినిమాలోని ఓ డైలాగ్ ని ట్విట్టర్ లో వాయిస్ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు చిరంజీవి. రాజకీయాలకి, చిరంజీవి నిజ జీవితానికి ఈ డైలాగ్ దగ్గరగా ఉండటంతో ఈ డైలాగ్ వల్ల సినిమాపై ఒక్కసారిగా అందరికి ఆసక్తి కలిగింది. తాజాగా రేపు సినిమా రిలీజ్ ఉండటంతో మరో వాయిస్ ట్వీట్ చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు చిరంజీవి.
తాజాగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి మరో డైలాగ్.. ”కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా తయారు చేసేది ఈ బ్రహ్మ” అంటూ వాయిస్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారి గాడ్‌ఫాదర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 4, 2022