Gatta Kusthi: తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన రీసెంట్ మూవీ ‘గట్ట కుస్తీ’ తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాను చెల్ల అయ్యవు డైరెక్ట్ చేయగా, స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్ మంచి నటనను కనబర్చగా, ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. అయితే కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు.
Matti Kusthi: ‘మట్టి కుస్తీ’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్
కాగా, తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. తమిళ వర్షన్ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాను మాస్ రాజా రవితేజ, విష్ణు విశాల్ కలిసి ప్రొడ్యూస్ చేశారు.
అయితే జనవరి 1న తమిళ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తుండగా, తెలుగు వెర్షన్‌ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాను చూడాలంటే తెలుగు ప్రేక్షకులు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.