Matti Kusthi: ‘మట్టి కుస్తీ’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ’(తమిళ్‌లో ‘గట్ట కుస్తీ’) తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మట్టి కుస్తీ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పార్ట్‌నర్‌గా మారింది.

Matti Kusthi: ‘మట్టి కుస్తీ’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

Matti Kusthi OTT Rights Acquired By Netflix

Matti Kusthi: తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ’(తమిళ్‌లో ‘గట్ట కుస్తీ’) తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మాస్ రాజా రవితేజ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలను క్రియేట్ అయ్యాయి. ఇక సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింత పెంచేశాయి. కాగా ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Matti Kusthi : విష్ణు విశాల్ కుస్తి రింగ్‌లో కాదట.. భార్యతో అంటా.. ‘మట్టి కుస్తి’ ట్రైలర్ రిలీజ్..

ఇక ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు చెళ్ల అయ్యవు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీ నటిస్తోంది. ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ కావడంతో, ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌కు కూడా మంచి క్రేజ్ దక్కింది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మట్టి కుస్తీ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పార్ట్‌నర్‌గా మారింది. థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం తాజాగా వెల్లడించింది.

Matti Kusthi: రవితేజ నిర్మాణంలో తమిళ హీరో విష్ణు విశాల్ సినిమా.. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్..

ఈ సినిమాను విష్ణు విశాల్‌కు చెందిన విష్ణు విశాల్ స్టూడియోజ్, రవితేజకు చెందిన RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మంచి అంచనాల మధ్య డిసెంబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.