Matti Kusthi : విష్ణు విశాల్ కుస్తి రింగ్‌లో కాదట.. భార్యతో అంటా.. ‘మట్టి కుస్తి’ ట్రైలర్ రిలీజ్..

టాలీవుడ్ మాస్ మహారాజ్ నిర్మాతగా తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మట్టి కుస్తి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో వచ్చే డైలాగ్..

Matti Kusthi : విష్ణు విశాల్ కుస్తి రింగ్‌లో కాదట.. భార్యతో అంటా.. ‘మట్టి కుస్తి’ ట్రైలర్ రిలీజ్..

Matti Kusthi trailer release

Matti Kusthi : టాలీవుడ్ మాస్ మహారాజ్ నిర్మాతగా తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మట్టి కుస్తి’. గతంలో విష్ణు విశాల్ ‘ఎఫ్‌ఐఆర్‌’ సినిమాకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు “RT టీమ్‌వర్క్స్‌” అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి, విష్ణు విశాల్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

Matti Kusthi: రవితేజ నిర్మాణంలో తమిళ హీరో విష్ణు విశాల్ సినిమా.. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్..

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో వచ్చే డైలాగ్.. “తమ్ముడులో బాక్సింగ్ జీవితం అనుకున్న అన్న కన్నా, దిక్కులు చూసిన పవన్ కళ్యాణ్ కప్ కొడతాడు. దీని బట్టి మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు” అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఇక హీరోహీరోయిన్లు మధ్య వచ్చే సీన్స్ ఫామిలీ ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తాయి అనేలా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో విష్ణు విశాల్ రెజ్లర్‌గా రింగ్ లోనే కాకుండా ఇంటిలో భార్యతో కూడా కుస్తికి దిగబోతున్నట్లు అర్ధమవుతుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రవితేజకి ప్రొడ్యూసర్ గా ఎంతవరకు బూస్ట్ ఇవ్వగలదో చూడాలి.