Gautam Ghattamaneni : మహేష్ వారసుడిగా సినిమాల్లోకి గౌతమ్ ఫిక్స్.. గౌతమ్ అమెరికాకు వెళ్ళింది అందుకోసమే..

గౌతమ్ పై చదువులకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూయార్క్ యూనివర్సిటీలో(NYU) చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు.

Gautam Ghattamaneni went to New York for Acting Course Namrata Post Goes Viral

Gautam Ghattamaneni : మహేష్(Mahesh Babu) తనయుడు గౌతమ్ ఘట్టమనేని అందరికి పరిచయమే. వన్ నేనొక్కడ్నే సినిమాలో గౌతమ్ చిన్ననాటి మహేష్ క్యారెక్టర్ చేసి అభిమానులకు దగ్గరయ్యాడు. గౌతమ్ పై చదువులకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే లండన్ లో ప్లస్ 2 చేసి ఇటీవలే న్యూయార్క్ యూనివర్సిటీలో(NYU) చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు.

నమ్రత శిరోద్కర్ దీని గురించి తన కొడుకుతో దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసి ఇటీవలే ఈ విషయం తెలిపింది. తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిపింది నమ్రత. గౌతమ్ చిన్నప్పటి ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో గౌతమ్ ఒక పేపర్ పట్టుకొని ఉన్నాడు. ఆ పేపర్ లో.. నేను పెద్దయ్యాక ఇండియాలో & అమెరికాలో యాక్టర్ అవుతాను అని రాసుంది. ఈ ఫోటోని షేర్ చేసి నమ్రత.. పలక మీద రాయడం దగ్గర్నుంచి స్క్రిప్ట్స్ రాయడం వరకు నీ కలలు, సంకల్పంతో అనుకున్నది సాధిస్తావు. జీవితంలో వెలిగిపోవడానికి ఒక ఫుల్ సర్కిల్ ఇచ్చింది లైఫ్. నువ్వు నీ కోసం చేసుకున్న ఈ ప్రయాణంలో నీకు ఆనందం, విజయాలు మాత్రమే దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యు సో మచ్ అని పోస్ట్ చేసింది నమ్రత.

Also Read : Salaar Hawa : కాలేజీల్లో సలార్ హవా.. భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఉన్నారేంట్రా బాబు.. కంప్యూటర్ ల్యాబ్ లో..

దీంతో నమ్రత పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో గౌతమ్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఇండియాకు వచ్చి హీరోగా ఎంట్రీ ఇస్తాడని మహేష్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ పోస్ట్ తో గౌతమ్ కూడా సినిమాలోకి వచ్చేస్తాడని కన్ఫర్మ్ అయ్యారు అభిమానులు. ఇక సితార కూడా సినిమాల్లోకి వస్తుందని గతంలోనే మహేష్ స్వయంగా చెప్పాడు. మరోవైపు పవన్ తనయుడు అకిరా కూడా అమెరికాకు శిక్షణ కోసం వెళ్ళాడు. అయితే అకిరా మ్యూజిక్ లో శిక్షణ కోసం అని సమాచారం.