Salaar Hawa : కాలేజీల్లో సలార్ హవా.. భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఉన్నారేంట్రా బాబు.. కంప్యూటర్ ల్యాబ్ లో..

ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని తెలిసిందే. అయితే భీమవరం విష్ణు, SRKR ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతుంది.

Salaar Hawa : కాలేజీల్లో సలార్ హవా.. భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఉన్నారేంట్రా బాబు.. కంప్యూటర్ ల్యాబ్ లో..

Bhimavaram Engineering College Students Prabhas Fans Salaar Fanism Goes Viral

Updated On : December 21, 2023 / 5:43 PM IST

Salaar Hawa : ప్రభాస్(Prabhas) సలార్ సినిమా రేపు డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ ఊపు కనిపిస్తుంది. అప్పుడే థియేటర్స్ వద్ద బ్యానర్స్ తో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తున్నారు.

ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారని తెలిసిందే. అయితే భీమవరం విష్ణు, SRKR ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతుంది. అక్కడి విద్యార్థుల్లో కూడా ఎక్కువగా ప్రభాస్ అభిమానులే ఉంటారు. సలార్ రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు తమ కంప్యూటర్ ల్యాబ్స్ లో ఉన్న అన్ని కంప్యూటర్స్ కి వాల్ పేపర్స్ గా సలార్ సినిమాల్లోని ప్రభాస్ ఫోటోలు పెట్టారు.

Also Read : Salaar Tickets : ‘సలార్’ అర్ధరాత్రి షో ఒక్కో టికెట్ 5000 వరకు.. భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ నిరసన.. టికెట్ రేట్లు పెంచేశారంటూ..

అన్ని సిస్టమ్స్ లో ప్రభాస్ ఫోటోలు వాల్ పేపర్స్ ఉండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. బాబోయ్ ఇదేమి కొత్త రకం అభిమాన ప్రదర్శనరా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ హంగామా ఫుల్ గా ఉంది. సలార్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.