Gautham Menon Wants to Play Villain Role in Vijay Thalapathy
Gautham Menon: ప్రేమకథలు తీయడంలో మంచి నేర్పరి అయిన గౌతమ్ మీనన్, ఇప్పటికే ఎన్నో అందమైన ప్రేమకథలు అందించాడు. అయన తెరకెక్కించిన ‘ఏ మాయ చేసావే’, ‘ సూర్య సన్ అఫ్ కృష్ణన్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, వంటి మర్చిపోలేని ప్రేమ కావ్యాలను సినిమాలుగా చిత్రీకరించి ప్రేక్షకులకు అందించాడు.
Gautham Menon: ‘సమంత-చైతన్య’ల విడాకులపై.. “ఏ మాయ చేసావే” డైరెక్టర్ గౌతమ్ మీనన్ స్పందన
ఇక ఇటీవల కాలంలో దర్శకుడి గానే కాదు నటుడి గాను ఫుల్ బిజీ అవుతున్నాడు ఈ ప్రేమ కథా దర్శకుడు. ‘సీతారామం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలోనూ నటించిన ఈ డైరెక్టర్.. “తనకి విలన్ గా నటించాలని ఉందంటూ, ముఖ్యంగా తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయకు ప్రతినాయకుడిగా నటించాలని ఉందని” ఆయన్ని కోరికను తెలిపాడు.
అలాగే తమిళ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో గౌతమ్ మీనన్ విలన్ గా నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. అటువంటి ఆఫర్ ఇప్పటివరకు నా దగ్గరకు రాలేదు. ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే వదులుకోను అంటూ అయన అభిప్రాయాన్ని వెల్లడించాడు.