Ye Maya Chesave : ‘ఏ మాయ చేసావే’ సినిమాని రిజెక్ట్ చేసిన చిరంజీవి.. ఆ రోల్ కోసం.. చేసుంటే క్లైమాక్స్ మొత్తం మారిపోయేదిగా..

తాజాగా గౌతమ్ మీనన్ ఒక ఇంటర్వ్యూలో ఏ మాయ చేసావే సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Gautham Vasudev Menon

Ye Maya Chesave : నాగచైతన్య – సమంత కాంబోలో ఫస్ట్ వచ్చిన సినిమా ‘ఏ మాయ చేసావే’. ఇది మంచి హిట్ అవ్వడమే కాక ఫ్యాన్స్ కి స్పెషల్ సినిమాలా మిగిలింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో తెరకెక్కించారు. రెండు భాషల్లో క్లైమాక్స్ కొంచెం ఛేంజ్ ఉంటుంది. అయితే తెలుగులో మరో క్లైమాక్స్ కూడా అనుకున్నాడట డైరెక్టర్ గౌతమ్ మీనన్.

తాజాగా గౌతమ్ మీనన్ ఒక ఇంటర్వ్యూలో ఏ మాయ చేసావే సినిమా గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Also Read : Chiranjeevi : కళ్యాణ్ బాబు సినిమా రెండేళ్ల తర్వాత.. ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ పై ‘మెగాస్టార్’ ట్వీట్ వైరల్.. చరణ్ కూడా..

గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏ మాయ చేసావే సినిమా మొదట మహేష్ బాబుతో అనుకున్నాను. అది కుదరలేదు. ఆ సినిమా క్లైమాక్స్ కోసం చిరంజీవిని తీసుకురావాలనుకున్నాను. క్లైమాక్స్ లో హీరో చిరంజీవి సినిమా డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ పెళ్లి వేరేవాళ్లతో జరుగుతుందని తెలిసి చిరంజీవి హీరోని హెలికాఫ్టర్ లో ఎక్కించుకొని పెళ్లి దగ్గరకు తీసుకెళ్లి హీరో – హీరోయిన్ ని కలుపుతాడు అని రాసుకున్నాను. చిరంజీవి గారిని కలిసి కథ కూడా చెప్పాను. కానీ ఆయన రిజెక్ట్ చేసారు. మనిద్దరం కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ యాక్షన్ సినిమా ఊహిస్తారు అని చెప్పి రిజెక్ట్ చేసారు అని తెలిపాడు.

Also Read : Sandhya Theatre : మొన్న బన్నీ ఫ్యాన్స్.. ఇవాళ పవన్ ఫ్యాన్స్.. ఇకపై ‘సంధ్య’ థియేటర్లో కష్టమే..