Bachelors Prema Kathalu : ‘బ్యాచిలర్స్ ప్రేమ కథలు’ కొత్త సినిమా ఓపెనింగ్.. గీతా సింగ్ కీలక పాత్రలో..

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

Geeta Singh Bachelors Prema Kathalu Movie Opening Ceremony

Bachelors Prema Kathalu : SM 4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీత సింగ్, కార్తీక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ.. పలువురు కీలక పాత్రల్లో MNV సాగర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘బ్యాచిలర్స్ ప్రేమ కథలు’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్ వి.సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ వీర శంకర్ క్లాప్ ఇచ్చారు.

బ్యాచిలర్స్ ప్రేమ కథలు దర్శక, నిర్మాత సాగర్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను తీసిన కాలం రాసిన కథలు సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సీక్వెల్ గా ఈ బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నాను. ఇందులో ఒక మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఈ నెలలో షూటింగ్ మొదలుపెట్టి 2025లోనే సినిమా విడుదల చేస్తాం అని తెలిపారు.

Also Read : Allu Arjun – Atlee : ప్రభాస్ కి నో చెప్పి.. అల్లు అర్జున్ కి ఓకే చెప్పిన హీరోయిన్.. AA22 లో హీరోయిన్ అనౌన్స్.. వీడియో అదిరింది..

నటి గీతా సింగ్ మాట్లాడుతూ.. ఆడియన్స్ అందరూ నా పాత్రకు కామెడీ ఆశిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేయబోతున్నాను. ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే అవకాశం కలిగింది అని తెలిపారు.