గీతాంజలి మరణం.. తెలుగు సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు తీరని లోటు..
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్ నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమా నుంచే ఆమెను చాలామంది ఎన్టీఆర్ గారి సీత అని పిలిచేవారు.. అంతగా సీతారామ కళ్యాణం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.
రామారావు ఆమెను సీత పాత్రకు సెలెక్ట్ చేయడమే కాకుండా.. దగ్గరుండి నటన, డ్యాన్స్, డైలాగ్ డిక్షన్ వంటివన్నీ నేర్పేవారట.. ఈ సినిమాలో హరనాథ్ రాముడిగా, ఎన్టీఆర్ రావణుడిగా కనిపించారు.. ‘కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు’ వంటి హిట్ సినిమాల్లో నటించిన గీతాంజలి.. తనతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన సహ నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు.
Read Also : నాన్నగారే స్ఫూర్తి అనేవారు : గీతాంజలి మృతికి సంతాపం తెలిపిన బాలయ్య
కొంత విరామం తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘పెళ్ళైన కొత్తలో,మాయాజాలం, గోపి గోపిక గోదావరి, భాయ్, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తమన్నా కథానాయికగా రూపొందుతున్న ‘దటీజ్ మహాలక్ష్మీ’ (క్వీన్-రీమేక్) గీతాంజలి నటించిన చివరి చిత్రం. నటించారు. నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారామె.. గీతాంజలి మరణం.. తెలుగు సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు తీరని లోటు..