Geetha Bhagat : నిర్మాతగా మారిన యాంకర్.. తను రాధే.. నేను మధు ఓటీటీలో స్ట్రీమింగ్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడిగా..

ఈ యాంకర్ కాస్తా ఇప్పుడు నిర్మాతగా మారి ఓటీటీలో ఓ షార్ట్ మూవీని నిర్మించింది. (Geetha Bhagat)

Geetha Bhagat : నిర్మాతగా మారిన యాంకర్.. తను రాధే.. నేను మధు ఓటీటీలో స్ట్రీమింగ్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడిగా..

Geetha Bhagat

Updated On : September 17, 2025 / 4:18 PM IST

Geetha Bhagat : అనేక సినిమా ఈవెంట్లను, సెలబ్రిటీ ఇంటర్వ్యూలను హోస్ట్ చేస్తూ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ గీతా భగత్. ఈ యాంకర్ కాస్తా ఇప్పుడు నిర్మాతగా మారింది. రఘురాం బొలిశెట్టితో కలిసి ఓ షార్ట్ మూవీని నిర్మించింది గీతా భగత్.

ఈటీవీ విన్ ఓటీటీలో ‘కథా సుధ’ అనే పేరుతో వారానికో షార్ట్ మూవీని విడుదల చేస్తున్నారు. మనసుకు హత్తుకునే కథలతో ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇందులో భాగంగా ‘తను రాధే.. నేను మధు’ అనే షార్ట్ మూవీని ఇటీవల సెప్టెంబర్ 14న రిలీజ్ చేసారు. 33 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ మూవీని ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ డైరెక్ట్ చేసారు. లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి, ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి ముఖ్య పాత్రల్లో ఈ సినిమాని నిర్మించారు.

Also See : Nilakhi patra : టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఒడియా బ్యూటీ.. నీలఖి పాత్ర ఫొటోలు..

ఈ సినిమా షూటింగ్ అంతా అమెరికాలోనే జరిగింది. విదేశాల్లో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారం చేసుకుని ఈ షార్ట్ మూవీని తెరకెక్కించారు ఆర్.పి. పట్నాయక్. స్వచ్ఛమైన ప్రేమలో నమ్మకం, సహనం, భావోద్వేగం ఉంటాయని.. వాటి గురించి తెలియజేస్తూ సెన్సిబుల్ గా ఈ షార్ట్ మూవీని తెరకెక్కించారు. క్లైమాక్స్ అందరినీ ఎమోషనల్ చేస్తుంది. మొదటి ప్రయత్నంలోనే నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు. తను రాధే.. నేను మధు షార్ట్ మూవీ ఈటీవి విన్ ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ తో ట్రెండింగ్ లో దోసుకుపోతుంది.

Geetha Bhagat

Also Read : VTV Ganesh : నా కెరీర్ నాశనం చేయొద్దు ప్లీజ్.. నాకు తెలుగు ఇండస్ట్రీ మెయిన్.. మూవీ టీమ్ తో స్టార్ కమెడియన్ గొడవ..