Geetha LLB New Serial in Star Maa Channel Telecasting Details Here
Geetha LLB Serial : ఇటీవల కొత్త కొత్త సీరియల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ మా ఛానల్ రెగ్యులర్ గా కొత్త సీరియల్స్ తీసుకువచ్చి సక్సెస్ అవుతుంది. తాజాగా స్టార్ మా ఛానల్ మరో సరికొత్త ఛానల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గీత LLB అనే టైటిల్ తో ఈ సీరియల్ రాబోతుంది.
మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభతో రాణిస్తూ ఎదుగుతున్నారు. అలా LLB చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపిస్తున్న ఓ అమ్మాయి కథే ఈ గీత LLB. బంధాలకు విలువనిచ్చే ఓ అమ్మాయికి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఎదురయ్యే మనుషులు, తనకు స్ఫూర్తి అనుకున్నవ్యక్తితోనే కోర్టులో వాదన చెయ్యాల్సి రావడం, న్యాయం కోసం పోరాడటం, ఈ క్రమంలో ఆమె అనుభవించే సంఘర్షణ.. ఇలాంటి అంశాలన్నీ కలగలసిన గీత అనే అమ్మాయి కథతో ఈ గీత LLB సీరియల్ రాబోతుంది.
ఇక ఈ సీరియల్ లో గీత పాత్రలో మెయిన్ లీడ్ లో నీతూ మాయ నటిస్తుంది. ఈ సీరియల్ స్టార్ మా ఛానల్ లో డిసెంబర్ 2 నుంచి టెలికాస్ట్ కానుంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు గీత LLB సీరియల్ టెలికాస్ట్ కానుంది. ఇక ఈ గీత LLB ఎమోషనల్ గానూ, వినోదంగాను ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ఈ సీరియల్ కి సంబంధించి పలు ప్రోమోలు కూడా రిలీజ్ చేసారు.