Pushpa 2 Ticket Rates : తెలంగాణలో పుష్ప 2 కోసం భారీగా పెరిగిన టికెట్ ధరలు.. అర్ధరాత్రి షోల పర్మిషన్ తో ఎంత పెరిగాయంటే..

పుష్ప 2 టికెట్ రేట్లు తెలంగాణలో భారీగానే పెరిగాయి.

Pushpa 2 Ticket Rates : తెలంగాణలో పుష్ప 2 కోసం భారీగా పెరిగిన టికెట్ ధరలు.. అర్ధరాత్రి షోల పర్మిషన్ తో ఎంత పెరిగాయంటే..

Huge Hike on Allu Arjun Pushpa 2 Ticket Rates in Telangana Here Details

Updated On : November 30, 2024 / 3:52 PM IST

Pushpa 2 Ticket Rates : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. 4వ తారిఖు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు కూడా పడనున్నాయి. ఈ సినిమాకి టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయని ముందు నుంచే ఊహించారు. మూవీ టీమ్ టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అనుమతులు ఇస్తూ జీవో విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం..

#డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చారు.
#పుష్ప2 రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9.30 గంటలకు వేసే బెనిఫిట్ షోలకు మాత్రం సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షోలకు 800 రూపాయలు టికెట్ ధర పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చారు.
# అర్థరాత్రి 1 గంటకు, తెల్లవారు ఝామున 4 గంటలకు వేసిన షోలకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపునకు అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపునకు అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతి ఇచ్చారు.

Also Read : Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో జాయిన్ అయిన పవన్.. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు..

దీంతో పుష్ప 2 టికెట్ రేట్లు తెలంగాణలో భారీగానే పెరిగాయి.

మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్ లో గరిష్టంగా 300 వరకు, మల్టీప్లెక్స్ లో గరిష్టంగా 500 పైనే టికెట్ రేట్ ఉండనుంది. ఆ తర్వాత వారం రోజులు సింగిల్ స్క్రీన్స్ లో గరిష్టంగా 255 వరకు, మల్టిప్లెక్స్ లో గరిష్టంగా 450 పైనే టికెట్ రేట్ ఉండనుంది. ఆ తర్వాత వారం రోజులు సింగల్ స్కరీస్ లో గరిష్టంగా 170 వరకు, మల్టీప్లెక్స్ లలో గరిష్టంగా 345 వరకు టికెట్ రేట్ ఉండనుంది. వీటికి తోడు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే ఎక్స్‌ట్రా చార్జీలు అదనం. ఇక బెనిఫిట్ షో ఎక్కడ చూసినా 1100 నుంచి 1200 వరకు రేటు ఉండటంతో మరీ ఇంతనా అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. మరి ఈ అధిక రేట్లు పుష్ప 2 కి ప్లస్ అవుతాయా చూడాలి.

Huge Hike on Allu Arjun Pushpa 2 Ticket Rates in Telangana Here Details