విల్ స్మిత్ జెమిని మ్యాన్ – ట్రైలర్

విల్ స్మిత్ నటించిన జెమిని మ్యాన్ 2019 అక్టోబర్‌ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

  • Publish Date - April 24, 2019 / 07:35 AM IST

విల్ స్మిత్ నటించిన జెమిని మ్యాన్ 2019 అక్టోబర్‌ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

ఫేమస్ హాలీవుడ్‌ యాక్టర్ విల్‌ స్మిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జెమిని మ్యాన్’. ‘లైఫ్ ఆఫ్ పై’ మూవీకి ‘అకాడెమీ అవార్డు’ అందుకున్న ఆంగ్ లీ డైరెక్ట్ చేస్తుండగా, జెర్రీ బ్రక్‌హెమెర్, డేవిడ్ ఎల్సన్, డానా గోల్డ్‌బెర్గ్, డాన్ గ్ర్యాన్గర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది.

ఇన్నోవేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్న ఈ సినిమాలో, హెన్రీ బ్రొగాన్‌ (విల్‌ స్మి్‌త్‌) అనే వ్యక్తిని పోలి మరో వ్యక్తి ఉంటాడు. హెన్రీ చేయాలనుకున్న పనులన్నీ, హెన్రీ కంటే ముందే అతను చేసేస్తుంటాడు. దాంతో హెన్రీ అతన్ని ఫినిష్ చెయ్యాలని ఫిక్స్ అవుతాడు. హెన్రీ ఎన్నిసార్లు ఎటాక్ చేసినా, ఆవ్యక్తి దెయ్యంలా మాయమైపోయి తప్పించుకుంటూ ఉంటాడు. 
Also Read : మహేష్ కి శత్రువుగా జగపతిబాబు

అసలు జెమిని మ్యాన్‌ ఎవరు? అతను అచ్చు హెన్రీలాగే ఎందుకున్నాడు? అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అన్నదే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విల్ స్మిత్ నటన, డియాన్ విజువల్స్, మార్కో మ్యూజిక్ అదిరిపోయాయి. మేరీ ఎలిజబెత్, బెనెడిక్ట్ వాంగ్ తదితరులు నటిస్తున్నారు. పారామౌంట్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న జెమిని మ్యాన్ 2019 అక్టోబర్‌ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ జెమిని మ్యాన్ ట్రైలర్..