టైమ్ సెట్ చేసుకోండి: కొత్త షో చేస్తున్న శ్రీముఖి

  • Publish Date - November 22, 2019 / 05:20 AM IST

రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్‌ గా నిలిచిన శ్రీముఖి.. స్టార్ మ్యూజిక్‌ లో ఓ కొత్త షోతో తిరిగి మనందరిని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయబోతుంది. ఓ కొత్త మ్యూజికల్ షోకు శ్రీముఖి హోస్ట్ చేయబోతుంది.

ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఓ ప్రోమో వీడియోను కూడా సదరు మ్యూజిక్ ఛానల్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో శ్రీముఖి డ్యాన్స్‌‌లు, పాటలతో దుమ్మురేపుతోంది. అంతేకాదు టైం సెట్ చేసుకోండి. లేదా అలారం పెట్టుకోండి ఫుల్ ఫన్ గ్యారెంటీ.. అంటూ చాలెంజ్ చేస్తుంది.

ఇక కేవలం టాక్ షో మాత్రమే కాదు.. వచ్చిన వారితో పాటలు పాడించడం, ఆటలు ఆడించడం, మనందరిని నవ్వించడం వంటి  ప్రయోగాలు కూడా చేయబోతోంది శ్రీముఖి. మరి ఈ షో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతోందనే విషయం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.