Ghani
RRR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రూపొందించిన భారీ మల్టిస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ కానుంది. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.
ఇక సినిమా రిలీజ్ ఉండటంతో వ్యాపార సంస్థలు, వేరే సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ని ఉపయోగించుకొని తమని ఎలా ప్రమోట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో, ఆ సినిమా వేసే థియేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కొన్ని సంస్థలైతే తమ బిజినెస్ కి ‘ఆర్ఆర్ఆర్’ని వాడుకొని ప్రమోట్ చేసుకుంటున్నాయి. తాజాగా వరుణ్ తేజ్ కూడా ఈ కోవలోకి వచ్చాడు.
RRR : చెర్రీ, తారక్‌లతో కలిసి నాటు నాటు స్టెప్ వేసిన అమీర్.. వైరల్ అవుతున్న వీడియో..
వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా కూడా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంటే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయిన రెండు వారాలకి గని సినిమాని రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ని ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ రోజు నుంచే మొదలు పెట్టాలని, ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ని వాడుకోవాలని భావిస్తున్నారు ఈ చిత్ర యూనిట్. సౌత్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పడే దాదాపు 1000కి పైగా థియేటర్లలో ‘గని’ ట్రైలర్ ని ప్లే చేయనున్నారు. దీంతో వరుణ్ తేజ్ కూడా తన సినిమా ప్రమోషన్ కి ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆడే థియేటర్లలో ‘గని’ ట్రైలర్ ప్లే అవ్వనుంది. ఇందుకు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#GhaniTrailer to be screened in 1000+ screens across South India with #RRRMovie by @qubecinema
ICYMI – https://t.co/b5qGhtNAPV
In Theatres #GhaniFromApril8th ?#Ghani ? @IAmVarunTej @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/jETDaOWVUt
— BA Raju's Team (@baraju_SuperHit) March 22, 2022