RRR : చెర్రీ, తారక్‌లతో కలిసి నాటు నాటు స్టెప్ వేసిన అమీర్.. వైరల్ అవుతున్న వీడియో..

ఢిల్లీలో జరిగిన ఈ ప్రమోషన్స్ కి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అమీర్ ఖాన్, రాజమౌళి, అలియా భట్ లు సందడి చేశారు......

RRR : చెర్రీ, తారక్‌లతో కలిసి నాటు నాటు స్టెప్ వేసిన అమీర్.. వైరల్ అవుతున్న వీడియో..

Rrr Dance

RRR :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రూపొందించిన భారీ మల్టిస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ కానుంది. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు.

 

ఢిల్లీలో జరిగిన ఈ ప్రమోషన్స్ కి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అమీర్ ఖాన్, రాజమౌళి, అలియా భట్ లు సందడి చేశారు. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ, ఒకరిని ఒకరు ఆట పట్టిస్తూ సరదాగా సాగింది. ఇక ఈ ఈవెంట్ లో నాటు నాటు స్టెప్ గురించి అమీర్.. ”మీరు ఆ స్టెప్ ని ఎలా చేశారు. అలియా కూడా అది చాలా ఈజీ అని చెప్పింది. నేను కూడా ప్రయత్నించాను” అని అడగడంతో చెర్రీ, తారక్ లు ఇద్దరూ కలిసి వేద్దామన్నారు.

RRR : గ్యాస్ సిలిండర్ తీసుకోండి.. ‘ఆర్ఆర్ఆర్’ టికెట్లు ఫ్రీగా పొందండి..

దీంతో చెర్రీ, తారక్, అమీర్, అలియా నలుగురు కలిసి నాటు నాటు స్టెప్ కి స్టేజిపై డ్యాన్స్ వేసి అలరించారు. వీరు నలుగురు కలిసి డ్యాన్స్ వేయడంతో ఫ్యాన్స్ అరుపులు, కేకలతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ ఆద్యంతం సరదాగా సాగింది.