Girija Oak
Girija Oak : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో ఎవరూ చెప్పలేరు. ఒక చిన్న వీడియోతో, ఒక చిన్న డైలాగ్ తో, డ్యాన్స్ తో, అంతెందుకు ప్రియా వారియర్ లాగా ఒక నవ్వుతో కూడా వైరల్ అయిపోతారు. తాజాగా గత రెండు రోజులుగా గిరిజ ఓక్ అనే నటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందంగా కనిపిస్తూ సింపుల్ గా చీరలో ఉన్న ఫోటోతో గిరిజ ఓక్ వైరల్ గా మారింది.(Girija Oak)
మరాఠీ, హిందీ పరిశ్రమకు చెందిన ఈ నటి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందంగా కనపడటంతో పాటు నటుడు గుల్షన్ దేవయ్య గురించి పొగుడుతూ మాట్లాడటం, మరికొన్ని విషయాలు సరదాగా మాట్లాడటంతో వైరల్ గా మారింది.
ఇంతకీ ఈ గిరిజ ఓక్ ఎవరంటే.. మహారాష్ట్ర నాగ్ పూర్ కి చెందిన అమ్మాయి. డిగ్రీ చదివిన తర్వాత నాటకాల్లోకి వెళ్ళింది. థియేటర్ ఆర్ట్స్ చేస్తూనే పలు యాడ్స్ లో నటించింది. అనంతరం మరాఠీ, హిందీ సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తారే జమీన్ పర్, జవాన్, షోర్ ఇన్ ది సిటీ.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించింది. కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై.. లాంటి హిట్ సిరీస్ లలో కూడా నటించింది. త్వరలో థెరఫీ షెరఫీ అనే సిరీస్ తో రానుంది. ఆల్మోస్ట్ 2007 నుంచి ఇండస్ట్రీలో ఉండి అనేక సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక ఇంటర్వ్యూలో స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కై బ్లూ కలర్ సారీలో అందంగా కనపడి, సరదాగా మాట్లాడటంతో వైరల్ గా మారింది.
స్కై బ్లూ కలర్ శారీలో ఉన్న ఫోటో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దేశమంతా ఇప్పుడు ఆమె ట్రెండ్ అవుతుంది. దీంతో ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఈ ట్రెండింగ్ తో గిరిజ ఓక్ కి ఇప్పటికైనా మరింత ఫేమ్ తెచ్చే పాత్రలు వస్తాయేమో చూడాలి.
ఈ భామకు ఇప్పుడు 37 ఏళ్ళు. మరాఠా సీనియర్ నటుడు శ్రీరంగ్ గాడ్బోలె తనయుడు సుహృద్ ని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సింపుల్ గా శారీలో కనిపిస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
Also Read : Eeswar : ప్రభాస్ ఫస్ట్ సినిమాకు 23 ఏళ్ళు.. ‘ఈశ్వర్’ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ ఎంతో తెలుసా? హిట్టా? ఫ్లాపా?