Shiva Child Artist : ‘శివ’ సైకిల్ ఛేజింగ్ సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..

తాజాగా శివ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆర్జీవీ ఓ పోస్ట్ పెట్టాడు.(Shiva Child Artist)

Shiva Child Artist : ‘శివ’ సైకిల్ ఛేజింగ్ సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..

Shiva Child Artist

Updated On : November 12, 2025 / 9:59 AM IST

Shiva Child Artist : నాగార్జున – ఆర్జీవీ కాంబోలో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా శివ అప్పట్లో చరిత్ర సృష్టించింది. 35 ఏళ్ళ తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఆర్జీవీ, నాగార్జున శివ సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. తాజాగా శివ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆర్జీవీ ఓ పోస్ట్ పెట్టాడు.(Shiva Child Artist)

శివ సినిమాకు నాగార్జున అన్నయ్య పాత్రలో మురళీమోహన్ నటించారు. ఆయన కూతురిగా సుష్మ అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. సినిమాలో బాబాయ్ అంటూ నాగార్జున వెనక తిరుగుతుంది. నాగార్జున – సుష్మకు ఓ సైకిల్ ఛేజింగ్ సీన్ ఉంటుంది. విలన్స్ కార్ లో హీరో వెనక పడితే నాగార్జున తన అన్న కూతురుని సైకిల్ మీద ముందు కూర్చోపెట్టుకొని విలన్స్ ని తప్పించుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడే ఓ ఫైట్ సీన్ కూడా అంటుంది. ఆ సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ బాగా భయపడుతుంది .

Also Read : Eeswar : ప్రభాస్ ఫస్ట్ సినిమాకు 23 ఏళ్ళు.. ‘ఈశ్వర్’ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ ఎంతో తెలుసా? హిట్టా? ఫ్లాపా?

35 ఏళ్ళ తర్వాత అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మని ఆర్జీవీ రివీల్ చేసాడు. ఆర్జీవీ సుష్మ రీసెంట్ ఫోటో షేర్ చేసి.. శివ ఐకానిక్ ఛేజింగ్ సైకిల్ సీన్ లో భయపడుతూ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మ పెరిగి పెద్దయి ఇప్పుడు ఇలా ఉంది. సుష్మ ఇప్పుడు అమెరికాలో AI & కాగ్నిటివ్ సైన్స్ లో రీసెర్చ్ చేస్తుంది అని తెలుపుతూ తన ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేసాడు.

ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్ కి సుష్మ సమాధానమిస్తూ.. థ్యాంక్యూ సర్. శివ లెగసీలో నన్ను గుర్తుంచుకున్నందుకు. చిన్నప్పుడు ఆ అనుభవం మర్చిపోలేనిది. అలాంటి గొప్ప సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున, ఆర్జీవీలకు శివ రీ రిలీజ్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసింది.

Also See : Kajal Aggarwal : ఆస్ట్రేలియాలో కాజల్ అగర్వాల్ వెకేషన్.. భర్తతో కలిసి ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు..

ఈమె పూర్తి పేరు సుష్మ ఆనంద్ అకోజు. తెలుగు అమ్మాయి అయినా ఇప్పుడు అమెరికాలో స్థిరపడినట్టు తెలుస్తుంది. తన ట్విట్టర్లో ఎక్కువగా తన వర్క్ కి సంబంధించిన పోస్ట్ లే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ మోడ్ లో ఉంది. దీంతో సుష్మ గురించి మరింత రీసెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.

Also See : Kaantha : రెండు రోజుల్లో సినిమా రిలీజ్.. ఓ వైపు నో ప్రమోషన్స్.. మరో వైపు కోర్టులో వివాదం.. దుల్కర్, రానా ఏం చేస్తారో..