Kaantha : రెండు రోజుల్లో సినిమా రిలీజ్.. ఓ వైపు నో ప్రమోషన్స్.. మరో వైపు కోర్టులో వివాదం.. దుల్కర్, రానా ఏం చేస్తారో..

ఓ వైపు ప్రమోషన్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే మరోవైపు ఈ సినిమాపై వివాదం నెలకొంది. (Kaantha)

Kaantha : రెండు రోజుల్లో సినిమా రిలీజ్.. ఓ వైపు నో ప్రమోషన్స్.. మరో వైపు కోర్టులో వివాదం.. దుల్కర్, రానా ఏం చేస్తారో..

Kaantha

Updated On : November 12, 2025 / 7:35 AM IST

Kaantha : దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ భోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో 1950 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా ‘కాంత’. నవంబర్ 14న ఈ సినిమా తమిళ్, తెలుగులో రిలీజవుతుంది. అయితే ట్రైలర్ చూస్తే సినిమా బాగుంటుంది అనిపిస్తుంది. దుల్కర్ మంచి కథలు ఎంచుకుంటాడని తెలిసిందే. వరుసగా అన్ని పరిశ్రమలలో దుల్కర్ హిట్స్ కొడుతున్నాడు.(Kaantha)

కానీ ఈ సినిమాకు ప్రమోషన్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. ఓ రెండు మూడు ప్రెస్ మీట్స్, ఓ నాలుగు ఇంటర్వ్యూలతో సరిపెట్టేసారు. సినిమా కాన్సెప్ట్ బాగున్నా బజ్ మాత్రం లేదు. రెండు రోజుల్లోనే రిలీజ్ ఉంది. మరి సైలెంట్ గానే దుల్కర్ హిట్ కొడతాడేమో చూడాలి. ఓ వైపు ప్రమోషన్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే మరోవైపు ఈ సినిమాపై వివాదం నెలకొంది.

Also Read : Rashmika Vijay : ఇవాళ అయినా విజయ్ – రష్మిక నోరు విప్పుతారా? ఫ్యాన్స్ వెయిటింగ్.. ఒక్క ఫోటో వస్తే చాలు సోషల్ మీడియా షేక్..

కాంత సినిమా తమిళ దివంగత నటుడు ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారని, ఇందుకు మా పర్మిషన్ తీసుకోలేదని, సినిమాలో ఆయన జీవితాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ మనవడు బి త్యాగరాజన్ చెన్నై సివిల్ కోర్టును ఆశ్రయించాడు.

దీనిపై చెన్నై సివిల్ కోర్టు 18వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని మూవీ యూనిట్ ని ఆదేశించింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. ఈ వివాదంపై సినిమా హీరో, నిర్మాత దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ కొంత భాగం మాత్రం ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవితం నుంచి తీసుకున్నది నిజమే కానీ చాలా భాగం కల్పితమే అని అన్నారు.

Also See : Shiva Jyothi : తల్లి కాబోతున్న శివజ్యోతి.. బిగ్ బాస్ భామ సీమంతం వేడుకలు..

ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ తమిళ పరిశ్రమ మొదటి నటుల్లో ఒకరు. 1934 నుంచే ఆయన హీరోగా సినిమాలు చేసారు. చేసింది తక్కువ సినిమాలు అయినా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. 1959లో ఆయన మరణించారు.

కాంత ట్రైలర్ చూస్తుంటే హీరో ఈగో చుట్టూ తిరుగుతుందని, ఇందులో కూడా ఓ మర్డర్, పోలీసులు ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి కాంత సినిమా ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ బయోపిక్ గా రానుందా చూడాలి. కోర్టు వివాదం నేపథ్యంలో సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా చూడాలి మరి.

Also See : Krithika Sheru Baby Shower : చెల్లి సీమంతం దగ్గరుండి సెలబ్రేట్ చేసిన హీరోయిన్.. కృతిక షేరు సీమంతం ఫొటోలు చూశారా?

కాంత ట్రైలర్ ఇక్కడ చూసేయండి..