Global Star Ram Charan Birthday Special Mega Power Star Travel From Chiranjeevi Son to Worldwide Recognition
Ram Charan Birthday : మెగాస్టార్ అంటే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో. అలాంటి హీరో కొడుకు హీరో అవుతున్నాడంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అంతటి ఒత్తిడిలో చిరుతలా ప్రయాణం మొదలుపెట్టి మొదటి సినిమాకే డ్యాన్సులు, ఫైట్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తన హార్స్ రైడింగ్ పవర్ చూపించి మగధీరతో బాక్సాఫీస్ బద్దలుకొట్టి రెండో సినిమాకే ఏ హీరో సాధించలేని రికార్డులు సాధించి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
అప్పుడు మగధీర పాన్ ఇండియా రిలీజ్ అయి ఉంటే ఇప్పటికే చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఓ చరిత్ర సృష్టించేవాడు అని అంతా భావించారు. ఆ తర్వాత ఫ్లాప్స్, కమర్షియల్ సక్సెస్ లు చూసినా గుర్తుండిపోయే సినిమా ఇవ్వట్లేదు అన్నారు. చరణ్ లుక్స్ ని, యాక్టింగ్ ని కూడా కొంతమంది విమర్శించారు. టాలీవుడ్ ని మూడు దశాబ్దాలు ఏలిన హీరో కొడుకుకి ఇలాంటి విమర్శలా అని ప్రశ్నించారు. అలా విమర్శలు చేసిన వాళ్లకు, ప్రశ్నించిన వాళ్లకు తన సినిమాలతోనే సమాధానాలు చెప్పాడు చరణ్.
Also See : Ram Charan : రామ్ చరణ్ RC16 లుక్స్ అదిరిపోయాయిగా.. గ్లోబల్ స్టార్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
ధ్రువ సినిమాతో మోస్ట్ స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టాడు. ఇక రంగస్థలం సినిమాతో నటనలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు కాని మిస్ అయింది. రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండు అని సినిమా హిట్ అయ్యాక అంతా భావించారు. ఇక RRR సినిమాలో రామరాజు పాత్రలో విధ్వంసం సృష్టించి టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ అల్లూరి సీతారామరాజు అంటే ఇలాగే ఉండేవాడేమో అనిపించేలా చేసాడు.
నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిట్లో శత్రువుల మీదకు దూసుకెళ్లే ఫిరంగిలా RRR తో పేలాడు చెర్రీ. ఆ బ్లాస్ట్ హాలీవుడ్ దాకా వినిపించి ఆస్కార్ వేదిక్ వరకు నడిపించి హాలీవుడ్ లో కూడా అనేక అవార్డులు సాధించేలా చేసింది. RRR తో హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని వివిధ దేశాల నుంచి కూడా అభినందనలు అందుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు చరణ్. టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఆయన్ని మించి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు చరణ్.
పాన్ ఇండియా కాదు ఇప్పుడు జపాన్, అమెరికా.. లాంటి పలు దేశాల్లో కూడా చరణ్ కి మార్కెట్ ఉంది. గేమ్ ఛేంజర్ తో పర్వాలేదనిపించినా ఇప్పుడు మరో మాస్ అవతారంలో RC16 సినిమాతో ఆ తర్వాత సుక్కు తో RC17 సినిమాతో మరో కొత్త చరిత్ర రాయడానికి సిద్దమయ్యాడు చెర్రీ.
Also Read : RC 16 Update : RC16 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఆ టైంకే.. చరణ్ బర్త్ డే రోజు..
ఇదంతా కాయిన్ కి ఒకవైపు. ఇంకో వైపు తండ్రిని మించిన మంచితనం, మానవత్వం. టాలీవుడ్ హీరోల్లో సేవా కార్యక్రమాల్లో ముందుండే హీరో అంటే మొదట చిరంజీవి పేరే వినిపిస్తుంది. ఎంతోమంది అభిమానులకు అండగా నిలిచి, అవసరాల్లో ఆదుకొని, బ్లడ్ బ్యాంక్ తో ఎన్నో లక్షల మందికి ప్రాణం పోసి, ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూనే మెగాస్టార్ గా మనసులు దోచుకుంటున్నారు.
మరి ఆయన కొడుకు అంటే ఆయన వ్యక్తిత్వానికి చిరునామాగా నిలిచారు. తండ్రి బాటలో ఫ్యాన్స్ కి సపోర్ట్ గా నిలుస్తూ, అవసరమైన అభిమానులకు అపోలోలో ఉచిత వైద్యం అందిస్తూ ఎంతమంది ఫ్యాన్స్ చుట్టుముట్టినా, ఫ్యాన్స్ తో ఇబ్బందిపడిన చెరగని చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తూ కోపం అనేదే లేకుండా అందరిలో కలిసిపోతూ హీరో అంటే ఇలాగే కదా ఉండాలి అనిపించుకున్నారు.
ఫ్యాన్స్ కి చరణ్ ప్రేమ పంచిన ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తన కోసం వచ్చే అభిమానులను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక భార్య, కూతురుకు టైం ఇస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్నాడు. ఒకప్పుడు చిరంజీవి కొడుకు చరణ్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చరణ్ తండ్రి చిరంజీవి అని అన్న కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అంటే మెగా పవర్ స్టార్ ప్రయాణం గ్లోబల్ స్టార్ గా ఏ రేంజ్ లో ఎదిగాడో అర్ధమవుతుంది. నేడు మార్చ్ 27 చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, చరణ్ ఫ్యాన్స్, నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC 16 సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు.