RC 16 Update : RC16 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఆ టైంకే.. చరణ్ బర్త్ డే రోజు..
రేపు మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో..

Ram Charan RC 16 Update Movie Title and First Look Releasing Time and Date Announced
RC 16 Update : రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివన్న, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయిందని సమాచారం.
రేపు మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో RC16 టైటిల్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఆశించారు. ఆశించినట్టే మూవీ యూనిట్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా RC16 టైటిల్ తో పాటు, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కూడా రేపు ఉదయం 9.09 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ విషయం అనౌన్స్ చేస్తూ ఓ మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ టైటిల్, చరణ్ మాస్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్ ఫుల్ జుట్టు, గడ్డంతో ఈ సినిమా లుక్స్ లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. క్రికెట్, రెజ్లింగ్ క్రీడల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. టైటిల్ పెద్ది అని గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. కానీ రేపు అధికారికంగా వచ్చేదాకా క్లారిటీ లేదు.
Grit, power, and an untamed spirit from the rural lands ❤️🔥#RC16 TITLE & FIRST LOOK out tomorrow at 9.09 AM 💥💥#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @IamJagguBhai @divyenndu… pic.twitter.com/ZvwUrN7fNl— Vriddhi Cinemas (@vriddhicinemas) March 26, 2025
ఇక ఈ సినిమా త్వరగా షూట్ పూర్తిచేసి దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్.