Global star Ram Charan Game Changer movie pre release event in an unexpected place
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. నెట్టింట సైతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Also Read : Salman Khan : ‘నాన్న ఫస్ట్ బైక్’.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన సల్మాన్ ఖాన్..
అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ అదిరిపోయే న్యూస్ తెలిపారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చెయ్యని అద్భుతం చేయ్యబోతున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారో తెలిపారు టీమ్. డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకి అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీగా నిర్వహించనున్నారు. ఇక ఈ ఈవెంట్ ను కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 లో నిర్వహించనున్నారు.
ఇక ఈ ఈవెంట్ కి చిత్ర బృందం అందరూ హాజరు కానున్నారు. ఇప్పటికే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పాట్నాలో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా అమెరికాలోనే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మరి అక్కడ కూడా తెలుగు సినిమాల హవ ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.