Salman Khan : ‘నాన్న ఫస్ట్ బైక్’.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Bollywood star Salman Khan shared his Dads first bike special post goes viral
Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎన్నో సినిమాల్లో నటించి భారీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన తండ్రి సలీం ఖాన్ అని ఎప్పుడూ ఎంతో గొప్పగా చెప్తుంటారు సల్మాన్. ఇటీవల తన తండ్రిపై ప్రేమ, జీవిత ప్రయాణాన్ని ‘యాంగ్రీ యంగ్ మెన్’ డాక్యుమెంటరీలో కూడా తెలిపారు సల్మాన్.
Also Read :Pushpa 2 : పుష్ప 2 కిస్సిక్ సాంగ్ ను ఎవరెవరు.. ఏ భాషల్లో పాడారో తెలుసా..
ఇక తాజాగా తన తండ్రిపై ఉన్న ప్రేమను మరోసారి తెలిపారు సల్మాన్. తన తండ్రి మొదటి బైక్ ఫోటో షేర్ చేసారు. తన తండ్రి మొదటి బైక్ అయిన ట్రయంఫ్ టైగర్‌పై కూర్చుని తన తండ్రి సలీం ఖాన్‌తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసారు. అలాగే “నాన్న 1వ బైక్, ట్రయంఫ్ టైగర్ 100 ,1956” అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
చాలా తక్కువ సమయంలోనే ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పోస్ట్ చూసిన నెటిజన్స్ అంతా “ఈ బైక్ మీ సినిమా కోసం వాడారు కదా” అని కామెంట్స్ చేస్తున్నారు.