Godfather Movie Promotions On The Clouds
Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” ఈ దసరా కానుకగా విడుదుల అవుతుండడంతో మూవీ మేకర్స్ సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో చిరంజీవి తన చార్టెడ్ ఫ్లైట్ లో విహరిస్తూ యాంకర్ శ్రీముఖి కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Chiranjeevi: నా నిజమైన పుట్టినరోజు సెప్టెంబర్ 22.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!
ఈ ప్రోమోలో చిరు ‘గాడ్ ఫాదర్’కి సంబంధించి పలు ఆశక్తికర విషయాలను వెల్లడిస్తూ.. “హీరోయిన్ లేదేంటని గాని, సాంగ్స్ లేవెంటనే ఆలోచన రాకుండా చేసే సబ్జెక్టు గాడ్ ఫాదర్” అంటూ చిరు చెప్పుకొచ్చాడు. అయితే మెగాస్టార్ ఇంతకుముందు మూవీ ఆచార్యలో కూడా ఆయనకు హీరోయిన్ లేకపోవడం, మాస్ మసాలా సాంగ్ లు లేకపోవడం ఫ్యాన్స్ కి కొంత నిరుత్సాహానికి గురి చేసింది.
అసలు చిరంజీవి నుంచి ప్రేక్షకుడు కోరుకునివే అవి. అలాంటిది ఈ సినిమాల్లో కూడా అవి లేవంటే ఫ్యాన్స్ కు నిరుత్సాహాని కలిగిస్తుంది. అలాగే ఈ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి నటిస్తుండడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు ఆరో ప్రాణం. గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అంటూ ఈ ఇంటర్వ్యూలో చిరు చెప్పుకొచ్చాడు.
In Clouds With #GodFather ??❤️#Megastar @KChiruTweets @MukhiSree @jayam_mohanraja#GodFatherOnOct5th #GodFatherOnOctober5th pic.twitter.com/JzeTg5uqcH
— Team Ram Charan Bangalore (@TeamBangloreRCf) September 23, 2022