Chiranjeevi: నా నిజమైన పుట్టినరోజు సెప్టెంబర్ 22.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!

చిత్రసీమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ నటుడిగా మొదలైన చిరంజీవి నటప్రస్థానం 'సుప్రీమ్ హీరోగా', 'మెగాస్టార్'గా అంచలంచలుగా ఎదుగుతూ నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి "గాడ్ ఫాదర్" అనిపించుకుంటున్నాడు. అలాంటి చిరంజీవి జన్మించి నేటికి 44 సంవత్సరాలు అయ్యింది. సెప్టెంబర్-22 తెలుగు కళామతల్లి కన్న చిరంజీవి పుట్టినరోజు. అదేంటి మెగాస్టార్ బర్త్ డే ఆగష్టు-22న కాదా...

Chiranjeevi: నా నిజమైన పుట్టినరోజు సెప్టెంబర్ 22.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!
ad

Chiranjeevi: చిత్రసీమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ నటుడిగా మొదలైన చిరంజీవి నటప్రస్థానం ‘సుప్రీమ్ హీరోగా’, ‘మెగాస్టార్’గా అంచలంచలుగా ఎదుగుతూ నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి “గాడ్ ఫాదర్” అనిపించుకుంటున్నాడు. సినిమాలోకి రావాలనుకునే ఎంతోమంది సాధారణ వ్యక్తులకు ఇన్స్పిరేషన్ అవుతున్నాడు.

Salman-Chiru: అందరి వాడు సల్మాన్.. అందుకే చిరుకి స్వీట్ కండిషన్స్!

అలాంటి చిరంజీవి జన్మించి నేటికి 44 సంవత్సరాలు అయ్యింది. సెప్టెంబర్-22 తెలుగు కళామతల్లి కన్న చిరంజీవి పుట్టినరోజు. అదేంటి మెగాస్టార్ బర్త్ డే ఆగష్టు-22న కాదా, ఈరోజు అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా. నిజమేనండి.. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా జన్మించింది ఈరోజే అండి.

ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశాడు.. “మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టినరోజు, ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ‘ప్రాణం ఖరీదు’ ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా, నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను” అంటూ ఎమోషనల్ అయ్యాడు.