Godfather: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరగనుందని ఇంతకుముందు వార్తలు రాగా, వాటిని నిజం చేస్తూ చిత్ర యూనిట్ నేడు అధికారంగా ప్రకటించింది. మలయాళ సినిమా 'లూసిఫెర్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Godfather Pre Release Event Date Fix

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరగనుందని ఇంతకుముందు వార్తలు రాగా, వాటిని నిజం చేస్తూ చిత్ర యూనిట్ నేడు అధికారంగా ప్రకటించింది. మలయాళ సినిమా ‘లూసిఫెర్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Godfather: గాడ్‌ఫాదర్ క్లైమాక్స్.. టాలీవుడ్, బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..!

సెప్టెంబరు 28, 2022న అనంతపురంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో “గాడ్ ఫాదర్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబడుతుందని మేకర్స్ తమ సోషల్ మీడియా వేదికలో ప్రకటించారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరెవరు హాజరవుతారనేది ఇంకా తేలలేదు.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.