Godfather: గాడ్‌ఫాదర్ సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రాబోతుంది. కాగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది.

Godfather: గాడ్‌ఫాదర్ సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఖాయం!

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Godfather: రీ-షూట్ జరుపుకుంటున్న గాడ్ ఫాదర్.. ముంబైలో చిత్ర యూనిట్!

కాగా, ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు చిత్ర దర్శకుడు మోహన్ రాజా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు కితాబిచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా వచ్చిందని.. అభిమానులకు థియేటర్లలో మాస్ జాతర కన్ఫం అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. అటు సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాను చూశాక, చాలా రోజుల తరువాత మెగాస్టార్ మళ్లీ తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనున్నాడని.. ఈ సినిమా అభిమానులను ఖచ్చితంగా అలరిస్తుందని వారు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది.

Godfather: ‘గాడ్‌ఫాదర్’కు దూరంగా పవన్ కళ్యాణ్.. కారణం ఇదే!

మొత్తానికి చాలా రోజుల తరువాత చిరంజీవి నుండి ఓ పొలిటికల్ డ్రామా మూవీ రాబోతుండటం.. అందులోనూ చిరు సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను తొలిరోజే చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.