Godfather Teaser To Be Out On August 21
Godfather Teaser To Be Out: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
Godfather To Give A Mega Treat: మెగా ట్రీట్‌ను రెడీ చేస్తోన్న గాడ్‌ఫాదర్..?
ఇక ఈ సినిమా నుండి ఓ మెగా అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఉండటంతో గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. గాడ్‌ఫాదర్ చిత్ర టీజర్‌ను ఆగస్టు 21న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మెగాస్టార్ బర్త్‌డే కానుకగా ఈ టీజర్ రాబోతుందని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
కాగా, ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రాబోతుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని దసరా బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.