Gopichand : కన్నడ స్టార్ డైరెక్టర్‌తో గోపీచంద్ 31వ సినిమా.. ఈ సారి మరింత మాస్‌గా..

రామబాణం గోపీచంద్ 30వ సినిమాగా రాగా ఆశించినంత ఫలితం రాకపోవడంతో నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా అని భావించారు. తాజాగా నేడు గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా అయన 31వ సినిమాను, టైటిల్ ని ప్రకటించారు.

Gopichand 31 movie Bhimaa announced under kannada director Harsha

Gopichand 31 : మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నాడు. ఇటీవల ఎన్నో అంచనాలతో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో వచ్చిన రామబాణం(Ramabanam) సినిమా భారీ పరాజయం పాలైంది. శ్రీవాస్ తో గతంలో లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ కొట్టిన గోపీచంద్ ఈ సారి హ్యాట్రిక్ కొడతాడని భావించినా నిరాశే ఎదురైంది.

రామబాణం గోపీచంద్ 30వ సినిమాగా రాగా ఆశించినంత ఫలితం రాకపోవడంతో నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా అని భావించారు. తాజాగా నేడు గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా అయన 31వ సినిమాను, టైటిల్ ని ప్రకటించారు. గోపీచంద్ 31 వ సినిమా కన్నడ స్టార్ డైరెక్టర్ అయిన హర్ష దర్శకత్వంలో రానుంది. హర్ష కన్నడలో భజరంగి, భజరంగి 2, వజ్రకాయ, అంజనీ పుత్ర.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. హర్ష ఇటీవలే శివరాజ్ కుమార్ వేద సినిమాతో రాగా ఆ సినిమా అంతగా ఆడలేదు.

Avika Gor : సౌత్‌ లో నెపోటిజం చాలా ఎక్కువ.. సౌత్ సినిమాపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన అవికా గోర్..

గోపీచంద్ 31వ సినిమాకు ‘భీమా’ అనే టైటిల్ ని ప్రకటించారు. శ్రీసత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో KK రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా మరింత మాస్ గా ఉండబోతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ హిట్ కొడతాడేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. KGF సినిమాకు సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.