Gopichand 32 : చాలా గ్యాప్ తర్వాత గోపీచంద్‌తో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వనున్న డైరెక్టర్ శ్రీను వైట్ల.. కొత్త సినిమా ఓపెనింగ్..
తాజాగా గోపీచంద్ తన 32వ సినిమాని ప్రారంభించాడు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ కామెడీ కమర్షియల్ సినిమాలు అందించిన శ్రీనువైట్లతో గోపీచంద్ కాంబో రానుంది.

Gopichand 32 movie under Sreenuvaitla Direction Movie Opening Pooja ceremony Happened
Gopichand 32 : మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నాడు. ఇటీవల కూడా ఎన్నో అంచనాలతో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో వచ్చిన రామబాణం(Ramabanam) సినిమా కూడా భారీ పరాజయం పాలైంది. ప్రస్తుతం గోపీచంద్ తన 31వ సినిమాగా కన్నడ స్టార్ డైరెక్టర్ అయిన హర్ష దర్శకత్వంలో ‘భీమ’ సినిమా చేస్తున్నాడు. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనపడబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
తాజాగా గోపీచంద్ తన 32వ సినిమాని ప్రారంభించాడు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ కామెడీ కమర్షియల్ సినిమాలు అందించిన శ్రీనువైట్లతో గోపీచంద్ కాంబో రానుంది. 2018లో చివరిసారిగా శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో వచ్చి పరాజయం చూశాడు. ఆ తర్వాత మంచు విష్ణుతో ఢీ సినిమాకు సీక్వెల్ ప్రకటించినా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళ తర్వాత శ్రీనువైట్ల దర్శకుడిగా సినిమా రానుంది. నేడు అధికారికంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
శ్రీను వైట్ల – గోపీచంద్ కొత్త సినిమా పూజా కార్యక్రమానికి రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా రాగా పలువురు సినిమా ప్రముఖులు కూడా విచ్చేశారు. భీమా సినిమా షూటింగ్ అయినా తర్వాత ఈ సినిమా షూట్ మొదలవుతుందని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా వీరిద్దరూ హిట్ కొడతారా? శ్రీనువైట్ల తన గత కామెడీని చూపిస్తాడా చూడాలి.
'Macho Star' @YoursGopichand and @SreenuVaitla are here at the Grand Launch event of @ChitralayamStds Production No. 1 ❤?
Watch live now ?
– https://t.co/m37W52qQeB#VenuDonepudi pic.twitter.com/Da4JG3Mc4n— Chitralayam Studios (@ChitralayamStds) September 9, 2023