Veera Simha Reddy: వీరసింహారెడ్డి వంద రోజుల వేట.. జీవితాంతం గుర్తిండిపోయే ఫీట్ అంటోన్న డైరెక్టర్!

నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సిినిమా తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది.

Gopichand Malineni Emotional Tweet On Veera Simha Reddy 100 Days Run

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కించగా, బాలయ్య ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. ఇక బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రలో చెలరేగిపోయి చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారు ఈ సినిమాకు పట్టం కట్టడంతో వసూళ్ల పరంగానూ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది.

Veera Simha Reddy : వీరసింహుడి 100 రోజుల విజయోత్సవం.. గెట్ రెడీ NBK ఫ్యాన్స్!

ఇక ఈ సినిమా తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వీరసింహారెడ్డి 100 డేస్ సందర్భంగా వారు కేక్స్ కట్ చేస్తూ, తమ అభిమాన హీరో సాధించిన ఈ రేర్ ఫీట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సాధించిన ఈ ఫీట్‌పై తనదైన మార్క్ ట్వీట్ చేశాడు. తన డెమీ గాడ్ అయిన గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడమే తనకు ఎంతో అదృష్టమని.. అలాంటిది తాను డైరెక్ట్ చేసిని సినిమాకు ప్రేక్షకులు 100 రోజుల థియేట్రికల్ రన్‌ను అందించడం తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని పేర్కొన్నాడు.

Veera Simha Reddy: టీఆర్పీ రేటింగ్స్‌కు ఎసరు పెట్టిన వీరసింహారెడ్డి.. బుల్లితెరపై బాలయ్య బ్లాస్ట్ ఎప్పుడంటే..?

కాగా, వీరసింహారెడ్డి మూవీలో అందాల భామలు శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.