డిఫరెంట్‌గా గోపీచంద్.. షూటింగ్‌కు రెడీ

  • Published By: Subhan ,Published On : June 13, 2020 / 10:46 AM IST
డిఫరెంట్‌గా గోపీచంద్.. షూటింగ్‌కు రెడీ

Updated On : June 13, 2020 / 10:46 AM IST

టాలీవుడ్  ఇప్పుడిప్పుడే  షూటింగ్స్ కి రెడీ అవుతోంది.   షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చినా కూడా..కరోనా భయంతో పాటు , గవర్నమెంట్ కండిషన్స్ కి తగినట్టు  ఇంకా ఎవ్వరూ  షూటింగ్స్ స్టార్ట్ చెయ్యలేదు. కానీ హీరో గోపీచంద్ మాత్రం నేను షూటింగ్ కి రెడీ అంటూనే కంప్లీట్ షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. మరి షూటింగ్ ఎప్పుడో , సినిమా రిలీజ్ ఎప్పుడో డీటెయిల్స్ చూద్దాం.

మాస్ & యాక్షన్‌ హీరోగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న గోపిచంద్‌, సక్సెస్‌ ఫుల్‌ హీరో అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు . మాస్ హీరో కు కావల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నా..భారీ బడ్జెట్ తో ఎనర్జిటిక్ పర్ ఫామెన్స్ ఇస్తున్నా ఎక్కడో అనుకున్న సక్సెస్ మాత్రం రావడం లేదు. అందుకే ఈ సారి సీటీమార్ అంటూ  డిఫరెంట్  స్టోరీ సెలక్ట్ చేసుకున్నారు గోపీచంద్ .  

సంపత్ నంది ఢైరెక్షన్లో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా చేస్తున్న సినిమా సీటీమార్.  ఆల్రెడీ 60 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాలో దిగాంగనా హీరోయిన్‌గా,  తమన్నా.. తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా కనిపిస్తోంది.  స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా  షూటింగ్ లాక్ డౌన్ తో ఆగిపోయింది. షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చారు కానీ ఎవ్వరూ ఇంతవరకూ ఎప్పటినుంచి షూటింగ్ స్టార్ట్ చేసేది అఫీషియల్ గా చెప్పలేదు. 

కానీ గోపీచంద్ యూనిట్ మాత్రం ఆగస్ట్ నుంచి మేం షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేశారు. మిగిలిన 40 పర్సెంట్ షూటింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి.. సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు గోపీచంద్ అండ్ టీమ్. ఇప్పటి వరకూ కమర్షియల్ మాస్ మూవీస్ చేసిన గోపీచంద్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా ట్రై చేస్తున్నారు కాబట్టి..ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ ని రీచ్ అవుతుందని  ఎక్స్ పెక్ట్ చేస్తున్నారంతా..