కొత్త ట్రాక్‌లోకి గోపిచంద్..

Gopichand: కామెడీకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సక్సెస్ కొడుతున్న డైరెక్టర్. యాక్షన్ తప్ప కామెడీ జోలికి పెద్దగా వెళ్లని హీరో. వరుసగా హిట్లు కొడుతున్న డైరెక్టర్, సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరో కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మాస్ యాక్షన్‌ హీరోగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న మ్యాచో హీరో గోపిచంద్‌, సక్సెస్‌‌ఫుల్‌ హీరో అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

మాస్ హీరోకు కావల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. భారీ బడ్జెట్‌తో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ఇస్తున్నా ఎందుకో కానీ అనుకున్న సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇప్పటికే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘సీటీమార్’ తో కొత్త ట్రాక్‌లోకి వచ్చిన గోపీచంద్.. కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో సక్సెస్ కొడుతున్న మారుతితో సినిమాకి సై అన్నారు.

కమర్షియల్ కాన్సెప్ట్‌కి కామెడీని యాడ్ చేసి ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే’ లాంటి హిట్ సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ మారుతి.. సంవత్సరం తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. తన 10 వ సినిమాని గోపీచంద్‌తో చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యు.వి క్రియేషన్స్, జి ఎ2 పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ ఫస్ట్ టైమ్ హిలేరియస్ కామెడీతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మారుతి డైరెక్షన్లో ట్రై చేస్తున్నారు.

అయితే ఈ గ్యాప్‌లో మారుతి .. మాస్ మహారాజ్ రవితేజ, యువ సామ్రాట్ నాగ చైతన్యతో పాటు మరికొంతమందికి స్టోరీలు చెప్పినా వర్కవుట్ కాలేదు. ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్నవాళ్లకి లిఫ్ట్ ఇస్తున్నాడు మారుతి అన్న టాక్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. మరి మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్‌కి మారుతి ఎలాంటి సినిమా ఇస్తాడో అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.