Gopichand Ramabanam Movie Audio Rights Bagged By Sony Music
Ramabanam Movie: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో గోపీచంద్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి.
Ramabanam Movie: శ్రీరామనవమి స్పెషల్.. ‘రామబాణం’ వదిలిన గోపీచంద్, జగపతి బాబు
రామబాణం అనే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకుంది. ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ప్రముఖ కంపెనీ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లుగా రామబాణం చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండటంతో, ఈ చిత్ర ఆడియో రైట్స్‌ను సోనీ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను శ్రీవాస్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఇందులో ఎమోషన్స్ కూడా బాగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Gopichand RamaBanam : గోపీచంద్ మొదటి బాణం అదిరిపోయింది.. రామబాణం ఫస్ట్ లుక్ టీజర్..
ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోండగా, విలక్షణ నటుడు జగపతి బాబు, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గోపీచంద్ అన్నావదినల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The Audio rights of #Ramabanam has been bagged by @SonyMusicSouth ?
A @MickeyJMeyer Musical ?
Bombastic Album Loading! ?#RamabanamOnMay5 ✅
Macho Starr @YoursGopichand @IamJagguBhai @khushsundar @DirectorSriwass @vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/NzcVeZP34Q— People Media Factory (@peoplemediafcy) April 5, 2023