Gopichand – Sreenu Vaitla : గోపీచంద్ – శ్రీను వైట్ల సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. అందర్నీ కాల్చేసి బిర్యానీ తింటూ..

తాజాగా గోపీచంద్ - శ్రీను వైట్ల సినిమా నుంచి ఫస్ట్ స్ట్రైక్ అంటూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Gopichand Sreenu Vaitla First Strike Title Glimpse Released

Gopichand – Sreenu Vaitla : వరుస ఫ్లాప్స్ లో ఉన్న శ్రీను వైట్ల, గోపీచంద్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ – చిత్రాలయం నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కావ్య థాపర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాపైనే శ్రీనువైట్ల, గోపీచంద్ ఆశలు పెట్టుకున్నారు. సినిమా చాలా వరకు విదేశాల్లోనే షూటింగ్ చేసినట్టు తెలుస్తుంది.

Also Read : Lucky Baskhar Teaser : దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ స్ట్రైక్ అంటూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘విశ్వం'(Viswam) అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ గ్లింప్స్ లో ఓ పెళ్లి దగ్గరికి వచ్చి గోపీచంద్ అందర్నీ కాల్చేసి చంపేస్తాడు. తర్వాత తాపీగా వచ్చి బిర్యానీ తింటూ.. ప్రతి అన్నం మెతుకు మీద అది ఎవరు తినాలో రాసి పెట్టి ఉంటుంది. దీనిపై నా పేరు రాసిపెట్టి ఉంది అని కూల్ గా డైలాగ్ చెప్పాడు. దీంతో ఇదేదో వెరైటీ యాక్షన్ మూవీలా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. మీరు కూడా ఈ టైటిల్ గ్లింప్స్ చూసేయండి.