Lucky Baskhar Teaser : దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్ రిలీజ్..

తాజాగా నేడు రంజాన్ సందర్భంగా ‘లక్కీ భాస్కర్’ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.

Lucky Baskhar Teaser : దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్ రిలీజ్..

Dulquer Salmaan Lucky Baskhar Teaser Released

Updated On : April 11, 2024 / 4:24 PM IST

Lucky Baskhar Teaser : దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇపుడు పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఆల్రెడీ మహానటి, సీతారామం, కొన్ని డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక్కడ కూడా దుల్కర్ సల్మాన్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో మరో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాని గతంలో ప్రకటించారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2లో ఒక్క జాతర సీన్‌కే.. అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారా?

ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా నేడు రంజాన్ సందర్భంగా ‘లక్కీ భాస్కర్’ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ టీజర్ ని చూసేయండి.

 

టీజర్ లో ఇది ఓ పీరియాడికల్ స్టోరీ అని తెలుస్తుంది. హీరో ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి, బ్యాంక్ ఎంప్లాయ్. అతని అకౌంట్ లోకి చాలా డబ్బు వస్తుంది. అతనికి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? లేదా లైఫ్ లో ఎదుగుతాడా అని ఆసక్తిగా చూపించారు. డబ్బు చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.