Pushpa 2 : పుష్ప 2లో ఒక్క జాతర సీన్‌కే.. అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారా?
పుష్ప 2 సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి తిరుపతి గంగమ్మ జాతర సీక్వెన్స్ గురించి వినిపిస్తుంది.

Allu Arjun Puhspa 2 Jathara Sequence Shot with Huge Crores of Budget Rumours goes Viral
Pushpa 2 : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, పోస్టర్స్, ఇటీవల టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచారు. ఇటీవల రిలీజయిన టీజర్ లో అల్లు అర్జున్ చీర కట్టుకొని తిరుపతి గంగమ్మ జాతరలో ఉన్నట్టు చూపించారు.
పుష్ప 2 సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి తిరుపతి గంగమ్మ జాతర సీక్వెన్స్ గురించి వినిపిస్తుంది. సినిమా మొత్తానికి ఇదే హైలెట్ అని ఓ సాంగ్ తో పాటు, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని, అల్లు అర్జున్ అమ్మవారి గెటప్.. ఇలా అన్నిటితో పుష్ప 2లో జాతర సీన్ పై హైప్ పెంచారు. ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ దానికి మరింత తోడయింది. రామోజీ ఫిలింసిటీలో సెట్ వేసి మరీ చాలా రోజులు ఈ జాతర ఎపిసోడ్ షూటింగ్ చేసారు.
తాజాగా టాలీవుడ్ లో ఈ జాతర ఎపిసోడ్ గురించి ఓ టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 సినిమాకి హైలెట్ గా నిలవనున్న ఈ జాతర సీక్వెన్స్ మొత్తాన్ని 50 కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించినట్టు సమాచారం. ఆ సెట్స్ కి, దాదాపు నెల రోజులు షూట్ కి, ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, డ్యాన్సర్లు, ఫైటర్లు, పర్ఫెక్షన్ కోసం చాలా టేక్స్ తీసుకోవడం, నిజమైన తిరుపతి గంగమ్మ జాతర భారీగా కనపడేలా డిజైన్ చేయడం.. ఇలా మొత్తం ఈ జాతర సీక్వెన్స్ కి అంతా కలుపుకొని దాదాపు 50 కోట్లు ఖర్చు అయింది అనిపిస్తుంది. ఇక పుష్ప 2 సినిమాని భారీగా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇంత భారీగా ఒక్క సీక్వెన్స్ కోసం ఖర్చుపెడుతున్నారంటే కచ్చితంగా థియేటర్లో ఈ సీన్ కి రచ్చ ఖాయం అంటున్నారు అభిమానులు.