ఇండో-పాక్ బోర్డర్ లో.. గోపీచంద్ స్పై

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సోమవారం ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ వద్ద కనిపించారు. అక్కడ భారత జవాన్లతో ఆయన మాట్లాడారట. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్లినట్లు అనేగా మీ సందేహం...

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 07:32 AM IST
ఇండో-పాక్ బోర్డర్ లో.. గోపీచంద్ స్పై

Updated On : January 22, 2019 / 7:32 AM IST

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సోమవారం ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ వద్ద కనిపించారు. అక్కడ భారత జవాన్లతో ఆయన మాట్లాడారట. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్లినట్లు అనేగా మీ సందేహం…

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సోమవారం ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ వద్ద కనిపించారు. అక్కడ భారత జవాన్లతో ఆయన మాట్లాడారట. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్లినట్లు అనేగా మీ సందేహం…
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు తిరు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో ఉన్న జైసల్మేర్‌లో సోమవారం ప్రారంభమయ్యింది. భారీ ఫైట్ సీన్స్‌తో షూటింగ్‌ను మొదలుపెట్టారు.  
ఈ సినిమా డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. 50 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో రాజస్థాన్, న్యూఢిల్లీతో పాటు ఇతర ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రొడక్షన్‌లో వస్తోన్న18వ చిత్రమిది. వేసవి కానుకగా మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.