×
Ad

చిరంజీవి సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ మెగాస్టార్ తోనే..

త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పాడ్ కాస్ట్ చేయడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Gossip Garage Chiranjeevi Is Going To Do A Podcast

Chiranjeevi : పాడ్ కాస్ట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. తమ మనసు విప్పడానికి, తీరిగ్గా కబుర్లు చెప్పడానికి.. ఒక అంశంపై సుదీర్ఘంగా చర్చించడానికి చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు పాడ్‌ కాస్ట్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో పాడ్ కాస్ట్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పాడ్ కాస్ట్ చేయడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తన కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో తన మనసులో మాటను చెప్పేశారట చిరు. పాడ్ కాస్ట్ మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారట. ఇందుకోసం చిరు కూతురు సుష్మిత ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారట. సినీ రంగంలో చిరుది నాలుగు దశాబ్దాలకు పైగా ప్రయాణం. మూడు తరాల నటీనటులు, టెక్నీషియన్లతో కలిసి పని చేశారాయన. ఎన్నో అద్భుతమైన అనుభవాలు, ఒకప్పటి ముచ్చట్లు..తనకు నచ్చిన విషయాలు, అనుభవాలను అభిమానులతో పంచుకునేందుకు రెడీ అవుతున్నారట చిరు.

The Raja Saab : ఓటీటీలోకి ప్ర‌భాస్ ‘ది రాజాసాబ్‌’.. స్ట్రీమింగ్ ఎక్క‌డ‌? ఎప్ప‌టి నుంచంటే?

ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవిని ఆన్ స్క్రీన్ మీద చూసిన ప్రేక్షకులు ఇక నుంచి పాడ్ కాస్ట్‌లో చూడబోతున్నారట. తన జీవిత పాఠాలను ప్రేక్షకులతో పంచుకోబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ మెగా డాటర్ సుష్మిత పూర్తి చేస్తున్నారని టాక్. మెగాస్టార్ పాడ్ కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా, ఒకప్పటి విషయాలన్ని ఇప్పటితరానికి తెలిసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటి జనరేషన్‌కు కూడా మెగాస్టార్ రోల్ మోడల్‌గా ఉన్నారు. ఆయన సినిమా వస్తే చాలు బాక్సాపీస్ షేక్ అవ్వాల్సిందే. ప్రతి మేకర్ ఆయనతో మూవీ చేయాలని ఎదురు చూడాల్సిందే. ఇంత బిజీ టైమ్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతుండటం అందరికీ ఆదర్శం అంటున్నారు. ఇక మెగాస్టార్ పాడ్ కాస్ట్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయట.