The Raja Saab : ఓటీటీలోకి ప్రభాస్ ‘ది రాజాసాబ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పటి నుంచంటే?
ప్రభాస్ నటించిన చిత్రం ది రాజాసాబ్ (The Raja Saab )జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
Prabhas The Raja Saab streaming on JIO hotstar from this date
The Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరించింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు జియోహాట్ స్టార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 6 నుంచి ఈ చిత్రం తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ బాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్లలో బాగానే అలరించిన ఈ చిత్రం ఓటీటీలో మరెన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
The Raja Saab Review : ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ.. హారర్ సినిమా అన్నారు.. కానీ..
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించగా.. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, విటివి గణేష్, సత్య.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
