SSMB 29 : గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీలో కామెడీ ట్రాక్!

రాజమౌళి సినిమాలంటేనే ఒక కొత్తదనం, భారీ సెట్టింగ్స్ ఉంటాయి.

రాజమౌళి సినిమాలంటేనే ఒక కొత్తదనం, భారీ సెట్టింగ్స్ ఉంటాయి. అయితే మహేష్ బాబు నటిస్తున్న SSMB29లో డైరెక్టర్ రాజమౌళి సరికొత్త కామెడీ ట్రాక్‌తో మహేష్ కెరీర్ లోనే అత్యంత హిల్లేరియస్ కామెడీ ట్రాక్ చేయబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. మహేష్‌ను ఒక కొత్త కోణంలో చూపించేందుకు, అతని స్టైలిష్ ఇమేజ్‌ను కాస్త చిలిపితనంతో మిక్స్ చేసి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడట.

వాస్తవానికి ఈ సినిమాలో మహేష్ బాబు ఒక స్మార్ట్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటిస్తాడని, కానీ కథలో ఒక ఊహించని ట్విస్ట్‌తో అతను ఒక చిన్న గ్రామంలో చిక్కుకుంటాడట. అక్కడ స్థానికులతో మహేష్‌కు జరిగే సంభాషణలు, అతని సీరియస్ పర్సనాలిటీకి భిన్నంగా వారి చిలిపి ప్రవర్తనతో జరిగే సిచువేషనల్ కామెడీ, థియేటర్స్‌లో నవ్వుల పండగ పూయించబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Bullet Bhaskar – Mahesh Babu : ఆ సినిమాకు మహేష్ బాబుకు మొత్తం డబ్బింగ్ నేను చెప్పాను.. నా డబ్బింగ్ చూసి మహేష్ గారు ఏమన్నారంటే..?

అయితే ఈ కామెడీ ట్రాక్ కోసం రాజమౌళి ఒక హాలీవుడ్ కామెడీ రైటర్‌ను స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా తీసుకున్నాడని, ఆ రైటర్ మహేష్ డైలాగ్ డెలివరీని డెడ్‌పూల్ స్టైల్‌లో స్వీట్-సర్కాస్టిక్ టోన్‌లో రాశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. సెట్స్‌లో ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడే మహేష్ స్వయంగా నవ్వుకుంటూ రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చిందట.

Roja – Kirak RP : రోజాపై కిరాక్ ఆర్పీ కామెంట్స్.. జబర్దస్త్ వాళ్ళు ఎందుకు స్పందించలేదు.. బుల్లెట్ భాస్కర్ ఏమన్నాడంటే..

ఈ కామెడీ సీక్వెన్స్‌లు హైదరాబాద్‌లో నిర్మించిన ఒక భారీ విలేజ్ సెట్‌లో షూట్ చేస్తున్నారని, త్వరలో అధికారిక అప్‌డేట్ కూడా వస్తుందన్న టాక్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే, మహేష్-రాజమౌళి కాంబో నవ్వుల బాంబ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా క‌నిపిస్తోంది.